Begin typing your search above and press return to search.
పొగడ్తలు కాదు విమర్శలు చేయండి .. మీడియాకి సీఎం ఆదేశాలు !
By: Tupaki Desk | 11 Oct 2021 5:38 AM GMTతమిళనాడు సీఎం స్టాలిన్ ఎన్నిక తర్వాత ఆ రాష్ట్రంలో అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో ఆ రాష్ట్ర నెటిజన్లతో పాటు ప్రజల్లో మంచి క్రేజ్ సంపాందించారు. స్టాలిన్ పరిపాలనలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తునే అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆర్ధరాత్రి సమయంలో సేలం నుంచి ధర్మపురికి వెళ్తున్న సమయంలోనే అధ్యామాన్‌కోటై పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు.. లోపలికి వెళ్లి పోలీసు స్టేషన్ నిర్మాణానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పీఎస్ ను ఎప్పుడు నిర్మించారు. పోలీసు స్టేషన్ ను ఎప్పుడు ప్రారంభించారు లాంటి వివరాలను తెలుసుకున్న సీఎం పీఎస్ లో నమోదైన కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
కాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం స్టాలిన్ దేశ రాజకీయాలకు ఆదర్శంగా ఉండే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలను ఆ ఫోటోలను కూడా ప్రస్తుత ముఖ్యమంత్రులు వాటిని కొనసాగించకపోవడం లేదంటే వాటి మీద తమ ఫోటోలను పెట్టి ప్రచారం చేసుకుంటారు. గత ప్రభుత్వాలు తీసుకున్న ఏ పథకాన్నైనా తమ స్వంత పథకంగా ప్రచారం చేసుకుంటారు. ఈ అయితే స్టాలిల్ మాత్రం ఇలా చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత ఫోటోలను స్కూల్ బ్యాగులపై అలాగే ఉంచి పంపిణి చేశారు. గతంలో ప్రింట్ చేసిన బ్యాగులపై జయలలిత ఫోటోను తొలగించకుండా చేసి రాష్ట్ర ఖాజనాపై భారం పడకుండా చేశాడు. మరోవైపు అమ్మ క్యాంటిన్లలో కూడా ఇదే విధంగా పాత సీఎం ఫోటోలు మార్చకుండా వాటిని కొనసాగించారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీలో ముఖ్యమంత్రిని పోగుడుతున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలను సున్నితంగా హెచ్చరించారు. ఇంకోసారి రిపిట్ కావద్దని చెప్పారు. దీని ద్వార అసెంబ్లీలో సమయం వృధా అవడం తప్ప ప్రయోజనం లేదని సున్నితంగా మందలించారు. ఇదే తరుణంలో తాజాగా మీడియా కి కూడా ఓ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తే విధంగా వార్తలు, కథనాలు ప్రచురించాలని తాను ఎన్నడూ ఆదేశించలేదని ,ప్రభుత్వ పథకాల్లో లోటుపాట్లు, విమర్శలు ఉంటే ఎత్తి చూపించాలని, వాటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ ఊహించని వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక నేతృత్వంలో ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ హాజరయ్యారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకొచ్చామని, పారిశ్రామిక రంగానికి పునర్జీవం పోశామ ని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని పారిశ్రామిక ఎగుమతుల్లో తమిళనాడు మూడో స్థానంలో నిలిచినట్టు గుర్తు చేశారు. తమిళనాడు పారిశ్రామిక పెట్టుబడులకు నెలవు అని, ఇక్కడ అన్ని రకాల వసతులు, అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ పథకాలను, తమ పనితీరును పొగడ్తలతో ముంచెత్తాలని తాను ఎన్నడూ మీడియాను ఆదేశించ లేదన్నారు. విమర్శలు ఎత్తి చూపించాలని, వాటిని సరి చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని , రాష్ట్రం రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు. అలాగే, రూ. 2 లక్షల కోట్లు పబ్లిక్ రంగ సంస్థలు సైతం అప్పుల్లో ఉన్నట్టు వివరించారు. నిధుల సమీకరణకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు వెల్లడించారు.