Begin typing your search above and press return to search.

మళ్లీ ఆశ్చర్యపరిచిన సీఎం

By:  Tupaki Desk   |   9 July 2021 11:02 AM IST
మళ్లీ ఆశ్చర్యపరిచిన సీఎం
X
తమిళనాడు సీఎంగా గద్దెనెక్కినప్పటి నుంచి తన వ్యక్తిత్వంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు సీఎం స్టాలిన్. సామాన్యులతో ఆయన కలిసిపోతున్న తీరు అందరికీ సంతోషం కలిగిస్తోంది. సడెన్ గా రోడ్ల మీదకు వచ్చి సామాన్యులతో కలిసి వారి కష్టసుఖాలు తెలుసుకుంటున్న వైనం ప్రశంసలు కురిపిస్తోంది.

తాజాగా తమిళనాడులోని పిన్నవాసల్ అనే చిన్న పట్టణంలో వివాహం చేసుకున్న రాజమణి-రామ అనే ఇద్దరు సామాన్య జంట రోడ్డు పక్కన నిలబడ్డారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆ రోడ్డు మీదుగా వెళుతూ ఆగిపోయారు. ఆ జంట తమకు ఆశీర్వదించడానికి సీఎం ఆగాడని తెలుసుకొని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

పెళ్లి వేషధారణలో కొత్త జంట దంపతులు రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. వారిద్దరూ సీఎం స్టాలిన్ కాన్వాయ్ ప్రయాణిస్తున్నప్పుడు పక్కనే ఆగి ఉన్నారు. రోడ్డు పక్కన కొత్త జంటను గుర్తించిన సీఎం స్టాలిన్ తన కాన్వాయ్ ను ఆపమని ఆదేశించాడు. తాను ప్రయాణిస్తున్న వాహనం నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆ జంట వద్దకు వెళ్లి వారిని ఆశీర్వదించాడు.

ఈ సడెన్ షాకింగ్ ఘటనకు నూతన వధూవరులు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తమను పలకరించడానికి కాన్వాయ్ ను ఆపడం చూసి షాక్ అయ్యారు. ఆయన ఆశీర్వాదం కోరుతూ సీఎం స్టాలిన్ కాళ్ల మీద పడ్డారు.

సీఎం స్టాలిన్ ఈ కొత్త జంటను ఆశీర్వదించాడు. తరువాత తన స్వస్థలమైన తిరుకువైకి ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ సంఘటన చూపరుల హృదయాలను తాకింది. సీఎం స్టాలిన్ ఇంత సామాన్యుడిగా మెలగడం చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.