Begin typing your search above and press return to search.

శెభాష్ సీఎం.. మరోసారి గొప్పమనస్సు చాటుకున్న స్టాలిన్

By:  Tupaki Desk   |   1 Nov 2021 4:27 PM GMT
శెభాష్ సీఎం.. మరోసారి గొప్పమనస్సు చాటుకున్న స్టాలిన్
X
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ ప్రజాహితమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధికారంలోకి వచ్చాక తనదైన రీతిలో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. తాజాగా మరోసారి ఆయన తన గొప్ప మనసు చాటుకున్నారు. ఆ రాష్ట్రంలోని కోయంబత్తూర్-వెలచెరి రూట్లో తన కాన్వాయ్ లో ప్రయాణిస్తున్న స్టాలిన్... వెనుక నుంచి వచ్చే అంబులెన్సును గమనించారు. వెంటనే తన కాన్వాయ్ ను రోడ్డుకు పక్కకు ఆపించారు. అలా అంబులెన్సుకు దారి ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు తమిళనాడు సీఎం స్టాలిన్.

సీఎం కాన్వాయ్ వెళ్తుంటే సహజంగా చాలా హంగామా ఉంటుంది. అయితే అంబులెన్సును చూసిన స్టాలిన్ మాత్రం... చాలా సాధారణంగా తన కాన్వాయ్ ను పక్కకు ఆపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళనాడు సీఎం మానవత్వానికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. సీఎం స్టాలిన్ ది గొప్ప మనసు అంటూ కామెంట్లు పెడుతున్నారు. స్టాలిన్ గొప్ప మనసుకు ఫిదా అయిన నెటిజన్లు... శెభాష్ సీఎం అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే కేవలం ఇది మాత్రమే కాకుండా ఇంతకు ముందు కూడా స్టాలిన్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా ప్రజల మన్ననలు పొందుతున్నారు.

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి స్టాలిన్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఇటీవల తీసుకున్న కాన్వాయ్ కుదింపు నిర్ణయానికి కూడా ప్రతిపక్షాల నుంచి సైతం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. చెన్నై అడయార్ లోని శివాజీ గణేషన్ విగ్రహాన్ని ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ కొద్దిరోజుల క్రితం సందర్శించారు. ఆ సమయంలో ట్రాఫిక్ ను నిలిపివేశారు. దాదాపు 25 నిమిషాల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ రద్దీలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్  అనంత వెంకటేశన్ కూడా చిక్కుకున్నారు. స్టాలిన్ పర్యటన వల్ల తాను 25 నిమిషాల ఆలస్యంగా వెళ్లాల్సివచ్చిందని తమిళనాడు రాష్ట్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రజలకు తన పర్యటనల వల్ల ఎలాంటి అసౌకర్యం కలగవద్దని భావించారు తమిళనాడు సీఎం స్టాలిన్. అందుకే ఆయన భద్రత విషయంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాన్వాయ్ లోని వాహనాలను తగ్గించాలని ఆదేశించారు. తాను ప్రయాణించే సమయంలో ప్రజలకు ఎవరికీ ఇబ్బందులు కలగవద్దని అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయానికి కూడా ప్రజలు ఫిదా అయ్యారు. సీఎం స్టాలిన్ ప్రజారంజక పాలనకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తోంది. అంబులెన్సు కోసం సీఎం స్టాలిన్ దారి ఇచ్చిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. మానవీయ దృక్ఫంథంతో సీఎం ఆలోచించి... తన కాన్వాయ్ ను రహదారి పక్కకు ఆపి మరీ దారి ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. సాధారణ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని స్టాలిన్ తీసుకునే నిర్ణయాలకు తమిళనాట ప్రజలు నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక నెటిజన్లు ఆయన నిర్ణయాలకు ఫిదా అయి.. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.