Begin typing your search above and press return to search.

గెలుపు ఎవ‌రిదైనా ప్ర‌మాణ‌స్వీకారం మాత్రం 12!

By:  Tupaki Desk   |   10 Dec 2018 4:57 AM GMT
గెలుపు ఎవ‌రిదైనా ప్ర‌మాణ‌స్వీకారం మాత్రం 12!
X
పోలింగ్ ముగిసింది. ఫ‌లితం రిజ‌ర్వ్ అయ్యింది. ఈవీఎంల‌లో త‌న తీర్పును చెప్పేసిన ఓట‌ర‌న్న రిలాక్స్ అయితే.. గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారు వేసుకుంటూ ఆయా రాజ‌కీయ పార్టీలు గెలుపు ధీమాను వ్య‌క్తం చేస్తున్నాయి ఏది ఏమైనా మ‌రో 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డి కావ‌ట‌మేకాదు.. అసారి అధికారాన్ని ఏ పార్టీకి ఓట‌రు అప్ప‌జెప్పార‌న్న విష‌యంపై స్ప‌ష్ట‌త వ‌చ్చేస్తుంది.

2014 ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈసారి పోలింగ్ ఎక్కువ‌గా ఉండ‌టంపై ఎవరికి వారు తామే గెలుస్తామ‌న్న మాట‌ను చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఏ పార్టీ గెలిచినా కొత్త ప్ర‌భుత్వం కొలువు తీరేది మాత్రం డిసెంబ‌రు 12గా చెబుతున్నారు. రేపు (డిసెంబ‌రు 11) ఫ‌లితాలు వెల్ల‌డైన వెంట‌నే ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన ప‌నులు చ‌క‌చ‌కా జ‌రిగిపోనున్నాయి.

అంత హ‌డావుడిగా కొత్త ప్ర‌భుత్వం కొలువు తీర‌టానికి కార‌ణం.. మంచి ముహుర్త‌మేన‌ట‌. డిసెంబ‌రు 12 త‌ర్వాత మంచి రోజులు లేక‌పోవ‌టంతో.. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అదే రోజు కొత్త ప్ర‌భుత్వం కొలువు తీర‌నుంది. డిసెంబ‌రు 12న బుధ‌వారం.. పంచ‌మి కావ‌టం.. ఈ ముహుర్తం టీఆర్ఎస్‌.. కాంగ్రెస్ ల‌కు మంచిగా ఉంద‌ని చెబుతున్నారు. డిసెంబ‌రు 12 త‌ర్వాత స‌మీప భ‌విష్య‌త్తులో మంచి రోజు లేక‌పోవ‌టంతో 12 తేదీ అంద‌రికి హాట్ ఫేవ‌రేట్ గా మారిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి అవ‌స‌ర‌మైన మెజార్టీ ప‌క్కాగా వ‌స్తే ప్ర‌మాణ‌స్వీకారం 12నే ఉంటుంద‌ని.. ఏ మాత్రం తేడా వ‌చ్చినా ప‌రిస్థితి మ‌రోలా ఉంటుంద‌ని చెబుతున్నారు.