Begin typing your search above and press return to search.
‘కేసీఆర్ నా రెండో ప్రాణం’.. ఆసుపత్రిలో కరోనా రోగి నినాదాలు!
By: Tupaki Desk | 22 May 2021 3:29 AM GMTకరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అందునా.. హోం ఐసోలేషన్ కాకుండా.. ఆసుపత్రికి.. అందునా ప్రభుత్వ దవాఖానాలో చేరారంటే.. వారి ఆరోగ్య పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరం ఉండదు. నీరసంగా.. నిస్సత్తువుతో.. ఎప్పటికి చికిత్స పూర్తైయి.. ఇంటికి వెళతానో కూడా తెలీని అయోమయంలో ఉన్న వేళలో.. రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా దగ్గరకు వచ్చి పలుకరించటం.. మీకు నేనున్నా అంటూ ధైర్యవచనాలు చెప్పిన తీరు కరోనా రోగుల్లో స్థైర్యాన్ని పెంచటమే కాదు.. సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా చేసింది.
ఈ కారణంతోనే కావొచ్చు.. ఒక పెద్ద వయస్కుడైన వెంకటాచారి అనే కరోనా రోగి.. ‘కేసీఆర్ జిందాబాద్.. కేసీఆర్ నా రెండో ప్రాణం’ అంటూ నినాదాలు చేసిన వైనం అక్కడి వారిని విస్మయానికి గురి చేసింది. ఏదో ఆసుపత్రికి వచ్చాం.. సందర్శించాం.. పరామర్శించామన్నట్లు కాకుండా.. కరోనా రోగులకు దగ్గరగా వెళ్లటం.. వారు చెప్పేది వింటూ.. వారికి ధైర్యవచనాలు పలికిన తీరు పలువురు ఆకట్టుకుంది.
పెద్ద వయస్కుడైన వెంకటాచారితో సీఎం కేసీఆర్ చేసిన సంభాషణను చూస్తే..
ఎం: మీదే ఊరు, పేరేంటిది పెద్దమనిషి?
వెంకటాచారి: సార్.. వెంకటాచారి సార్... మట్టెవాడ
సీఎం: ఎన్ని రోజులైంది వచ్చి ఇక్కడికీ
వెంకటాచారి: పన్నెండు
రోజులైతంది సారు...
సీఎం:ఇప్పుడెలా ఉంది...
వెంకటాచారి: మంచిగనే ఉన్నది సారు.. గోలీలు ఇస్తున్నరు... భోజనం పెడుతున్నరు
సీఎం: మందులు వాడుతా ఉండూ.. తొందరగానే తగ్గుతుంది.. అన్న మాటలకు ఆ పెద్ద వయస్కుడు తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ కు జై కొట్టారు. మరింత ఉత్సాహవంతంగా తయారయ్యారు. ‘డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటరు. ఆరోగ్యం మంచిగ కాగానే ఇంటికి పంపిస్తరు. ఏం ఫికర్ పడొద్దు. అండగా నేనున్నా..’’ అంటూ బాధితులు పలువురితో మాట్లాడిన సందర్భంగా వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్.
కరోనా చికిత్స పొందుతున్న 68 ఏళ్ల వృద్ధురాలి వద్దకు వెళ్లగానే ఆమె తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. ‘సార్ మిమ్మల్ని చూసి చాన్నాళ్లయింది. మీరిక్కడికి రావటం.. మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉందయ్యా.. మీరు చల్లగా ఉండాలె’ అంటూ సంతోషానికి గురయ్యారు. మరో మహిళ వద్దకు వెళ్లిన సందర్భంగా వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
సీఎం కేసీఆర్: అమ్మా.. మీ పేరేంటి?
యాదమ్మ: యాదమ్మ సార్
కేసీఆర్ ఏ ఊరమ్మ... ఎక్కడి నుంచి వచ్చారు?
యాదమ్మ: సార్ మాది రంగశాయిపేట.. ఇక్కడ్నే వరంగల్‌లో..
కేసీఆర్: ఇప్పుడెలా ఉంది.. మంచిగనే ఉందిగదా!
యాదమ్మ: సార్ ఇప్పుడు మంచిగనే ఉంది.. పూర్తిగా మంచిగైతే ఇంటికి పోదామని సూత్తన్న
కేసీఆర్: భోజనం, గోలీలు మంచిగ ఇస్తున్నరా..?
యాదమ్మ: మంచిగనే ఇస్తున్నరు. తొందరగ నయమైతే బాగుండనిపిస్తుంది
కేసీఆర్: మీకేమీ కాదు.. ధైర్యంగా ఉండు.. అండగా నేనుంటా