Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర బుల్లెట్ ప్రాజెక్ట్ పై సీఎం ఉద్దవ్ కీలక నిర్ణయం ..

By:  Tupaki Desk   |   2 Dec 2019 7:42 AM GMT
మహారాష్ట్ర బుల్లెట్ ప్రాజెక్ట్ పై సీఎం ఉద్దవ్ కీలక నిర్ణయం ..
X
మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాల తరువాత ..ప్రజా పాలనని రోడ్డున పడేసి ..పదవుల కోసం పార్టీలు వ్యూహాలు రచించాయి. ఈ వ్యూహంలో చివరికి శివసేన విజయం సాధించి ..కాంగ్రెస్ , ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకంటే ముందు బీజేపీ , అజిత్ పవార్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ విశ్వాస పరీక్ష లో పాల్గొనబోతున్న సమయంలో అజిత్ తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ..ఎన్సీపీ లోకి తిరిగి వచ్చారు. దీనితో విశ్వాస పరీక్షకి సరైన సంఖ్యా బలం లేకపోవడంతో .. సీఎం ఫడ్నవిస్ తన పదవికి రాజీనామా చేసారు. ఆ తరువాత మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి.

తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు స్పీకరించిన శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సీఎం హోదాలో ఆదివారం అసెంబ్లీ లో మాట్లాడుతూ ..సీఎం ఫడ్నవిస్ పై , బీజేపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. అలాగే ప్రశంసలు కూడా గుప్పించారు. ఇక దేశానికే తలమానికంగా మారాలి అని దేశ ప్రధాని మోడీ ..గత బీజేపీ ప్రభుత్వ హయాంలో అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు బుల్లెట్ ట్రైన్ నడపాలని భావించి ..ఆ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. జపాన్ ప్రధానమంత్రి షింజో అబే, నరేంద్ర మోడీతో కలిసి 2017 సెప్టెంబర్ లో ఈ ప్రాజెక్టుకు అహ్మదాబాద్ లో శంకుస్థాపన చేశారు.2023 నాటికి అహ్మదాబాద్, ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్ ను నడిపించాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

అయితే , తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఉద్దవ్ థాకరే ..ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కి బ్రేక్ వేశారు. ఈ ప్రాజెక్ట్ యొక్క బడ్జెట్ 1.1 లక్షల కోట్లపై రివ్యూ వేయబోతున్నట్టు ఆదివారం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అసలు ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటివరకు జరిగిన పనులపై కాంట్రాక్టర్ ని రివ్యూ కోరనున్నారు. అలాగే మహారాష్ట్రలో గత బీజేపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అన్ని ముఖ్యమైన పనులని రివ్యూ చేయబోతున్నట్టు చెప్పారు. ఆలా రివ్యూ చేసిన తరువాత ఆ ప్రాజెక్ట్ కి కొత్త ముగింపు డేట్ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. అలాగే అతి త్వరలో మహారాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండబోతుంది అని తెలిపాడు.