Begin typing your search above and press return to search.
ఆ సీఎం నోట కరోనా వార్నింగ్.. కొత్త ఆంక్షలతో మళ్లీ భయం
By: Tupaki Desk | 22 Feb 2021 8:50 AM GMTరోనా పోయింది. టీకా వచ్చింది. ఇంకేం ఫర్లేదన్న ధీమాను పక్కన పెట్టేసే టైం వచ్చింది. వెళ్లిపోయిందనుకున్న కరోనా మళ్లీ వెనక్కి వచ్చేసిన వైనం తాజాగా పెరుగుతున్న కేసులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. అంతేకాదు.. ముఖ్యమంత్రే స్వయంగా సీన్లోకి వచ్చి ప్రజలకు మహమ్మారి హెచ్చరికల్ని చేస్తున్న వైనం చూస్తే.. షాక్ తినాల్సిందే. ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎక్కడ ఉందంటారా? రెండు తెలుగు రాష్ట్రాలకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితి ఉంది.
తాజాగా ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ.. ప్రజలకు కరోనా హెచ్చరికలు జారీ చేశారు. కరోనా యూటర్న్ తీసుకున్నట్లుగా కనిపిస్తుందన్న ఆయన.. సెకండ్ వేవ్ అవునా? కాదా? అన్న విషయం తేలటానికి మరో వారం నుంచి రెండు వారాల టైం పట్టొచ్చని చెబుతున్నారు. ఆదివారం రాత్రి వేళలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటం ద్వారా.. దీనికున్న ప్రాధాన్యతను చెప్పకనే చెప్పేశారు.
సాధారణ ప్రజలకు టీకాలు అందుబాటులోకి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాలని.. అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కోవిడ్ 19పై యుద్ధాన్ని ప్రపంచ యుద్ధంతో పోల్చిన సీఎం.. మాస్కు పెట్టుకోవటం ద్వారా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే వీలుందన్నారు. వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్టులు వస్తున్నాయన్న ప్రచారంలో నిజం లేదన్న ఆయన.. మాస్క్ లు పెట్టుకోకుంటే ఫైన్ వేస్తామన్నారు.
ఈ సందర్భంగా కరోనా కొత్త సిద్ధాంతాన్ని అందరూ అలవాటు చేసుకోవాలన్నారు. ‘నేను బాధ్యతగా ఉన్నాను’ అన్నది న్యూ కోవిడ్ సిద్ధాంతంగా చెప్పారు. కొత్త కేసులు వెలుగు చూస్తున్న వేళ.. సోమవారం నుంచి ఆంక్షలు అమల్లోకి వస్తాయన్న ఉద్ధవ్ థాకరే.. ప్రభుత్వ ఆఫీసులకు వచ్చే ఉద్యోగుల్ని తగ్గిస్తామన్నారు. అంతేకాదు.. ప్రభుత్వ కార్యక్రమాలన్ని జూమ్ ద్వారా నిర్వహించుకోవాలన్నారు. ర్యాలీలు.. సమావేశాలు లేవన్న ఆయన.. ఆఫీసుల్లోని ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతించాలన్నారు.
కొద్దిరోజుల పాటు.. ప్రజలంతా ఒక చోటకు చేరటం.. రాజకీయ.. మత సంబంధిత కార్యక్రమాలకు దూరంగా ఉండటం.. నిరసనల్లో పాలుపంచుకోకపోవటం మంచిదన్నారు. ఇక.. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కర్ఫ్యూను అమల్లోకి తీసుకొచ్చారు. మరికొన్నిచోట్ల ఆలయ దర్శనాల మీదా పరిమితుల్ని విధించటం గమనార్హం. ఇదంతా చూస్తుంటే.. గత ఏడాది లాక్ డౌన్ వేళలో.. ఉన్న పరిమితులు ఒక్కొక్కటిగాతెర మీదకు మళ్లీ వస్తున్నాయని చెప్పాలి. సో.. వీలైనంత కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది. సో.. బీకేర్ ఫుల్.