Begin typing your search above and press return to search.
ఆటోలో తిరిగిన రాయల్ సెలబ్రిటీ సీఎం
By: Tupaki Desk | 3 Nov 2015 11:46 AM GMTముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా కొందరిలో ఆ దర్పమే వేరు. సహజంగానే రాజవంశీకురాలైన రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె బ్యాక్ గ్రౌండ్ రాజవంశీకురాలన్న విషయం తెలిసిందే. గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో సెలబ్రిటీ స్టేటస్ లో ర్యాంప్ వాక్ లు చేసి వార్తల్లోకి ఎక్కారు.
ఏం సీఎం అయితే ర్యాంప్ వాక్ చేస్తే తప్పేంటన్న ప్రశ్నలు వేసేవారు. పవర్ పోయి.. ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత కానీ ఆమెకు తత్వం బోధపడలేదని చెబుతారు. ఆ మధ్యన జరిగిన ఎన్నికల్లో బీజేపీ గాలి పుణ్యమా మరోసారి రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆమె... గతంలో తనకున్నరాయల్ సీఎం అన్న పేరు ప్రఖ్యాతుల్ని పోగొట్టుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.
సెలబ్రిటీ సీఎంగా పేరున్న ఆమె తాజాగా.. సాదాసీదాగా ఒక ఆటోలో ప్రయాణించి వార్తల్లోకి వచ్చారు. ముఖ్యమంత్రి అంటే మినిమం డజనుకు తగ్గకుండా కాన్వాయ్ ఖాయం. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఒక్కటంటే ఒక్కటే ఆటోలో.. ఎలాంటి హడావుడి లేకుండా ఒక కళాత్మకమైన ఆటోలో (ఆటోను ప్రత్యేకంగా అలంకరించారు) ఆమె ఎక్కి..జైపూర్ వీధుల్లో తిరిగారు.
తన ప్రయాణం పూర్తి అయిన తర్వాత.. తాను ప్రయాణించిన ఆటో ఫోటోను పోస్ట్ చేస్తూ.. ఇలాంటి ఆటోలు కనిపిస్తే వాటిల్లో ప్రయాణించి అస్వాదించండి అంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. అంతేకాదు.. తాను ఎక్కిన లాంటి కళాత్మక ఆటోల్లో ప్రయాణిస్తే ఆ ఆటోల ఫోటోల్ని కూడా పోస్ట్ చేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చర్యను కొందరు విమర్శిస్తున్నా..
దేశ..విదేశాల నుంచి పర్యాటకులను తాజా ఫోటోలు ఆకర్షించటమే కాదు.. రాజస్థాన్ పర్యాటక ఇమేజ్ ను మరింత పెంచే వీలుందని చెబుతున్నారు. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఏ పని అయితే మాత్రం.. అభినందించాల్సిందే.