Begin typing your search above and press return to search.
మంత్రిని గుడికి తీసుకెళ్లిన సీఎం.. గంగా జలంతో శుద్ధి చేయటమా? ఎందుకిలా?
By: Tupaki Desk | 25 Aug 2022 12:30 PM GMTబిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తాజాగా ఒక వివాదంలో చిక్కకున్నారు. తెలిసి చేశారా? తెలియక చేశారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాజాగా ఆయన తన ఐటీ మంత్రి మహ్మద్ ఇస్రాయల్ మన్సూరీని తీసుకొని విష్ణుపాద్ ఆలయాన్ని సందర్శించటం వివాదస్పదంగా మారింది. ఆలయ నిబంధనల ప్రకారం హిందువేతరులు.. ఈ గుడిలోకి అడుగు పెట్టనివ్వరు. ఇదే విషయాన్ని తెలియజేసే సూచికను ప్రముఖంగా ప్రదర్శిస్తుంటారు. అయితే.. వీటిని పట్టించుకోని ముఖ్యమంత్రి నితీశ్.. తన తీరుతో వివాదానికి తెర తీశారు.
తాను గుడిని దర్శించటాన్ని సదరు బిహార్ మంత్రి మాత్రం తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇదిలా ఉంటే.. మైనార్టీ మంత్రి గుడిలోకి వెళ్లటాన్ని బీజేపీ నేతలు తప్పు పడుతున్నారు. ఈ సందర్భంగా వారో సవాల్ విసురుతున్నారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కు దమ్ము.. ధైర్యం ఉంటే.. మక్కా.. మదీనాలకు వెళ్లాలని సవాలును సంధించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్. సీఎం నితీశ్ తీరును కమలనాథులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కావాలనే.. హిందువుల మనోభావాల్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బ తీయాలన్న లక్ష్యంతోనే మంత్రి మహ్మద్ ఇస్తాయల్ ను గుడిలోకి తీసుకెళ్లారన్నారు.
ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ కూడా తీవ్రంగా తప్పు పట్టారు. డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ను టార్గెట్ చేసిన ఆయన.. ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగానే ముస్లిం మంత్రిని ఆర్జేడీ కోటా కింద ఆలయంలోకి తీసుకెళ్లారన్నారు. హిందూ సమాజం మనోభావాల్నిదెబ్బ తీశారంటూ తప్పుపట్టారు. ఎంత సీఎం హోదాలో ఉంటే మాత్రం.. ఇలా చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. దేవాలయాన్ని ముఖ్యమంత్రితో పాటు మంత్రి మన్సూరీ సందర్శించిన వైనంపై ఆలయ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి మన్సూరీ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఆయన మతం గురించి తమకు తెలీదని చెబుతున్నారు. జరిగిన దానికి ఫలితంగా ఆలయ ప్రాంగణాన్ని.. గర్భ గుడిని గంగాజలంతో కడిగి శుద్ధి చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు.. బీజేపీ నేతల వ్యాఖ్యలపై ఆర్జేడీ నేతలు తీవ్రంగా తప్పు పట్టారు.
అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిని తప్పు పడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏ వర్గానికి చెందిన వారైనా ఎక్కడికైనా వెళ్లేందుకు వీలు కల్పించే రాజ్యాంగం ఆధారంగా దేశం నడుస్తుందన్న వారికి.. ఒకే ఒక్క సూటి సవాలును విసురుతూ.. ఆర్జేడీ నేతలు చెప్పినట్లే.. ముఖ్యమంత్రి మక్కా.. మదీనాలకు వెళితే సరిపోతుందంటున్నారు.
మరి.. ఆ పని చేసేస్తే.. దేశంలోని కొన్ని పరిమితులకు సీఎం నితీశ్ చక్కటి పరిష్కారం చూపిన వారు అవుతారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. మరి.. నితీశ్ అలాంటి పని చేస్తారా? బీజేపీ నేతల సవాళ్లకు ఆయన ఏమని సమాధానం ఇస్తారో?