Begin typing your search above and press return to search.

కేసీఆర్ ను ఫాలో అవుతున్న సీఎం యోగి: ఇద్దరి టార్గెట్ వారే !

By:  Tupaki Desk   |   20 Aug 2021 5:54 AM GMT
కేసీఆర్ ను ఫాలో అవుతున్న సీఎం యోగి: ఇద్దరి టార్గెట్ వారే !
X
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఫాలో అవుతున్నారా....? కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని ప్రారంభించిన దళితబంధు ను సీఎం యోగి ఆదిత్యనాథ్ కాపీ కొడుతున్నారని తెలుస్తోంది. ఈ దళితబంధు పథకం నుండి దళిత కుటుంబాల్లోని అర్హుల ఖాతాల్లో రూ. 10 లక్షల చొప్పున ప్రభుత్వం జమచేయనుంది. అయితే , ఇదే తరహాలో సొమ్మును కాకపోయినా , దళిత బంధు పథకం పోలిన పథకాన్ని యూపీ ప్రభుత్వం తీసుకురాబోతుంది.

యూపీ అసెంబ్లీలో గురువారం మాట్లాడిన ఆయన..2017 లో తమ ప్రభుత్వం ఎర్పడిన తరువాత యాంటీ లాండ్ మాఫియా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిందని..ఆ సంస్థ ఇప్పటివరకు 67 వేల ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నదని చెప్పారు. ఇవన్నీ రెవెన్యూ శాఖకు చెందినవని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నవారు దర్జాగా అక్రమంగా కబ్జా చేసిన భూములు కూడా వీటిలో ఉన్నాయని ఆయన వెల్లడించారు. వీటిలో స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చామని, స్కూళ్ల సమీపంలో ఈ భూములు ఉన్న పక్షంలో పిల్లల క్రీడలకు ఇవి సౌలభ్యంగా ఉంటాయని భావించామని, అలాగే గ్రామీణులు తమ సభలను నిర్వహించుకోవడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆయన చెప్పారు.

ఏది ఏమైనా, దళితులు, పేదలకు ఇళ్ళు కట్టించి ఇవ్వాలని ప్రతిపాదించామన్నారు. గత ఫిబ్రవరిలోనే విధాన పరిషత్ కలో తానీ మేరకు ప్రకటన చేశానన్నారు. మాఫియా ముఠాల నుంచి 67 వేల ఎకరాలను విముక్తం చేశామని, ఇక ఈ భూముల్లో పేదలకు ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని యోగి వెల్లడించారు. రాష్ట్రంలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ ఆయన, పంచాయత్ లలో 46 శాతం మంది. బ్లాకు స్థాయి ఎన్నికల్లో 56 శాతం మంది మహిళలు ఎన్నికయ్యారని చెప్పారు. కొంతమంది తాలిబన్ల ను సమర్థిస్తున్నారని, వారే మళ్ళీ మహిళా సంక్షేమం గురించి గొంతు చేయించుకుంటున్నారని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. వారి నిర్వాకాన్ని బట్టబయలు చేస్తామని ఆయన అన్నారు.