Begin typing your search above and press return to search.
జగన్.. కేసీయార్ అక్కడ మీటింగ్...?
By: Tupaki Desk | 22 Jan 2023 1:30 PM GMTఏపీలో కాలూనాలని కేసీయార్ చూస్తున్నారు. అందుకు గానూ ఆయన బీయారెస్ ని పెట్టి మరీ జాతీయ స్థాయిలో విస్తరించాలని భావిస్తున్నారు. ఏపీలో కూడా బీయారెస్ తన సత్తా చాటాలని కేసీయార్ కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో బీయారెస్ రాకకు స్వాగతం చెప్పి ఊరుకుంది వైసీపీ. మరి బీయారెస్ కి ఎంతవరకూ సాయం చేస్తుంది అన్నది ఆసక్తికరమైన చర్చగా ఉంది.
ఏపీలో బీయారెస్ ఎంత బలపడితే ఆ మేరకు వైసీపీకి రాజకీయ లాభమే అని అంటున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఆ ఓట్లు బీయారెస్ చీల్చుకుంటే అక్కడికి తమకు లాభమే ఉంటుంది అని అంచనా కడుతోంది. ఇదిలా ఉంటే కేసీయార్ జగన్ ల మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి అన్న దాని మీద కూడా ఎవరికి వారు చర్చించుకోవడమే తప్ప బయటకు ఏమీ తెలియదు. కేసీయార్ జగన్ని సీఎం గా చూడాలనుకునే వారిలో ముందు వరసలోనే ఉన్నారు.
నిజానికి 2014లోనే కేసీయార్ జగన్ ఏపీకి సీఎం అవుతారు అని భావించారు. కానీ తృటిలో అవకాశం తప్పింది. అయితే 2019లో మాత్రం జగన్ మంచి మెజారిటీతో సీఎం అయ్యారు. దాని వెనక కేసీయార్ సాయం కూడా ఉందని చెబుతారు. ఇదిలా ఉటే 2024లో జగన్ మళ్లీ గెలవాలని కేసీయార్ కోరుకుంటున్నారా అన్నది కూడా మరో కీలకమైన అంశం. దీనికి జవాబు కూడా ఎవరికి తోచినది వారు చెప్పుకోవచ్చు.
ఇద్ద్దరి మధ్య పెద్దగా రిలేషన్స్ లేవు అనుకునేవారు కేసీయార్ జగన్ ఓడిపోవాలని కోరుకుంటారు అని అనుకోవచ్చు కానీ జగన్ మరోసారి గెలవడమే కేసీయార్ కి కావాల్సింది అని అంటున్న వారూ ఉన్నారు. జగన్ ఏపీకి సీఎం గా ఉంటే ఆయన ఏపీని దాటి వెళ్లారు. బయట రాజకీయం అసలు పట్టించుకోరు. ఆయన మానాన ఆయన ఉంటారు. అది కేసీయార్ కి లాభదాయకమే అని విశ్లేషణలు ఉన్నాయి.
ఇవన్నీ ఇలా ఉంటే కేసీయార్ జగన్ ల మధ్య మంచి అనుబంధం ఉంది అన్న వారు ఉన్నారు. ఈ ఇద్దరికీ ఒక్కరే రాజగురువుగా ఉన్నారు. ఆయనే విశాఖ స్వరూపానందేంద్ర సరస్వతి. ఆయన మొదట కేసీయార్ కి ఆధ్యాత్మిక గురువుగా ఉంటూ జగన్ వైపు వచ్చారు. కేసీయార్ రెండవమారు అధికారంలోకి రావడానికి రాజ్యశ్యామల యాగం చేయించిన వారు స్వరూపానందేంద్ర స్వామీజీయే. ఇక ఢిల్లీలో బీయారెస్ పార్టీ ఆఫీస్ ప్రారంభం టైంలో కేసీయార్ ఈ మధ్యనే మరోసారు రాజశ్యామల యాగం చేయించారు.
ఈ నెల 27 నుంచి 31 వరకూ విశాఖ శారదాపీఠంలో పీఠం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి.ఈ ఉత్సవాలకు ఎంతో మంది అతిరధ మహారధులను పీఠం తరఫున ఆహ్వానించారు. అందులో ఏపీ తెలంగాణా సీఎంలు ఇద్దరూ ఉన్నారని అంటున్నారు. ఏపీ సీఎం జగన్ ఈ నెల 28న పీఠానికి వచ్చి రాజశ్యామల యాగంలో పాలుపంచుకుంటారని తెలుస్తోంది. మరి కేసీయార్ శారదాపీఠానికి వస్తున్నారా అన్నది తెలియడంలేదు. అయితే ఆయన కూడా వస్తున్నారు అని అంటున్నారు.
కేసీయార్ తన బీయారెస్ పార్టీ జాతీయ స్థాయిలో అఖండంగా వెలుగొందాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఆయన పీఠానికి తప్పకుండా వస్తారు అని తెలుస్తోంది. మరి ఏపీ తెలంగాణా సీఎంలు ఇద్దరూ పీఠానికి వస్తే కనుక కచ్చితంగా భేటీ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. దాదాపు మూడేళ్ల తరువత ఇద్దరు సీఎంలు పీఠం వేదికగా మీట్ అవుతారు అని అంటున్నారు.
మరి ఈ ఇద్దరు నేతలూ కలిస్తే ఏమి మాట్లాడుకుంటారు అన్నది మరో చర్చ. ఏది ఏమైనా కేసీయార్ జగన్ కలుసుకోవడం అన్నది ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కనుక జరిగితే మాత్రం అది టాప్ లెవెల్ పొలిటికల్ న్యూస్ అవుతుంది అని అంటున్నారు. ఇక ఈ ఇద్దరు శ్రేయోభిలాషిలా రాజ గురువు స్థానంలో స్వరూపానందేంద్ర స్వామి ఉన్నారని అంటున్నారు. మళ్లీ ఈ ఇద్దరూ గెలవాలని గెలుస్తారని పీఠం కూడా ఆకాంక్షిస్తోంది
అని అంటున్నారు.
ఏది ఏమైనా విశాఖ రాజధాని కావాలని తాను మరోమారు సీఎం కావాలని జగన్ రాజశ్యామల యాగంలో పాలుపంచుకుంటున్నారు. జాతీయ నేతగా తాను వెలగాలని కేసీయార్ కోరుకుంటున్నారు. ఈ ఇద్దరికీ స్వామీజీ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఇక ఈ ఇద్దరికీ రాజశ్యామల మాత దీవెనలు కూడా ఇప్పించేందుకే పీఠానికి ఆహ్వానించారని అంటున్నారు. చూడాలి మరి ఈ వార్తలు ఎంతవరకూ నిజమో కానీ కేసీయార్ జగన్ విశాఖ వేదికగా భేటీ అయితే అది జాతీయ రాజకీయాల్లోనే అతి పెద్ద సంచలనం అవుతుంది అనడంలో సందేహం లేదు.