Begin typing your search above and press return to search.

టీడీపీ నీచ చరిత్ర ని ఎండగట్టిన సీఎం !

By:  Tupaki Desk   |   22 Jan 2020 5:50 AM GMT
టీడీపీ నీచ చరిత్ర ని ఎండగట్టిన సీఎం !
X
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్నది ఒక చరిత్రాత్మక నిర్ణయమని, కానీ ఆ బిల్లును శాసనమండలిలో టీడీపీ అడ్డుకుందని, ఇది విపక్ష నేత చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేల దిక్కు మాలిన వైఖరి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఎస్సీల మధ్య చిచ్చుపెట్టి విభజించడం ద్వారా లబ్ధిపొందాలని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమమే మా ప్రభుత్వం లక్ష్యం కాబట్టి ..అందు కోసమే అసెంబ్లీ లో మంగళవారం మరోసారి ఆ బిల్లును ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి తమ ధ్యేయమని, అందుకే మంత్రి పదవుల్లో ఆరుగురిని నియమించామని, ఐదుగురు ఉప ముఖ్యమంత్రుల్లో ఇద్దరు ఆ వర్గాలకు చెందిన వారున్నారని తెలిపారు.

అంతేకాకుండా దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ చంద్రబాబు మాత్రం జనాభాలో దాదాపు 18 శాతం ఉన్న ఎస్సీలను విడదీయడం కోసం స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూలేని విధంగా ఎస్సీలకు మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని , మాల, మాదిగతో పాటు రెల్లి ఇతర కులాలకు వేర్వేరుగా మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఆరు మంత్రి పదవులు ఇచ్చామన్నారు. వీటన్నింటితో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఇంకామేలు చేయడం కోసం వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే గతంలో ఆ బిల్లును మండలిలో టీడీపీ అడ్డుకుందని, శాసన సభ లో మళ్లీ బిల్లును ప్రవేశ పెట్టామని సీఎం తెలిపారు.

అలాగే రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లో రెండు మినహా మొత్తం వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ వర్గాలకు చెందిన స్థానాల్లో టీడీపీ నుంచి ఒకరు, జనసేన నుంచి మరొకరు మాత్రమే గెలిచారు. జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి సమయానుగుణంగా మద్దతు ఇస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇంకా మేలు చేయడం కోసం మరోసారి అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లును యథాతథంగా ప్రవేశపెట్టాం అని, దీనికి అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.