Begin typing your search above and press return to search.
అసెంబ్లీలో బాబు వీడియోల కలకలం
By: Tupaki Desk | 27 Jan 2020 9:48 AM GMTశాసనమండలి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న వైసీపీ సర్కారు ఏకంగా ఈరోజు బిల్లును అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. సీఎం జగన్ స్వయంగా మండలి రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గమనార్హం.
ప్రస్తుతం సీరియస్ గా కొనసాగుతున్న ఈ చర్చలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు ద్వంద్వ నీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టి సంచలనం సృష్టించారు.
వైసీపీ మంత్రి పేర్ని నాని కోరిక మేరకు నాడు వైఎస్ హయాంలో మండలి పునరుద్ధరణను పురస్కరించుకొని నాటి ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మాట్లాడిన వీడియోను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రదర్శించడం కలకలం రేపింది.
ఈ వీడియో చూపించి మరీ చంద్రబాబును అసెంబ్లీ సాక్షి గా మంత్రి పేర్ని నాని అడ్డం గా బుక్ చేశారు. చంద్రబాబు తన జీవితంలో తీసుకున్న అన్ని నిర్ణయాలు యూటర్నేనని ఈ వీడియో చూపించి నాని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విడగొడితే ఊరుకోనన్న చంద్రబాబు.. ఆ తర్వాత అంగీకారం తెలుపుతూ లేఖ ఇచ్చారని గుర్తు చేశారు.
ఇదే చంద్రబాబు మతతత్వ బీజేపీ కి మద్దతు ఇవ్వనని.. ఆ తర్వాత పొత్తు పెట్టుకున్నాడని మంత్రి నాని చంద్రబాబు కుట్రలను వీడియోతో సహా బయటపెట్టి చీల్చిచెండాడారు. ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు.. జగన్ కాలిగోటికి కూడా కదపలేరని హెచ్చరించారు.