Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ!

By:  Tupaki Desk   |   5 Nov 2019 12:02 PM GMT
ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ!
X
విభజన సమస్యలు, ఏపీకి కేంద్రం నుంచి దక్కాల్సిన వాటి విషయంలో ఇప్పటికే పలు సార్లు కేంద్రానికి విన్నపాలు చేస్తూ ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. విభజన హామీల అమలు, ఏపీకి ద్రవ్యలోటు వంటి అంశాల గురించి కేంద్రాన్ని కోరుతూనే ఉన్నారు. అయితే పెద్దగా స్పందన వ్యక్తం కావడం లేదు మోడీ ప్రభుత్వం నుంచి.

కనీసం ఉమ్మడి ఏపీ విభజన అంశాలను కూడా మోడీ ప్రభుత్వం పరిష్కరించిన దాఖలాలు కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో మరోసారి ప్రధాని దృష్టికి అంశాలను తీసుకెళ్తున్నారు ఏపీ సీఎం జగన్.
అందులో భాగంగా తాజాగా ఆయన ఒక లేఖ రాశారు. ఏపీలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి బొగ్గు గనులూ కేటాయించని విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర విభజనతో సింగరేణి పూర్తిగా తెలంగాణ పరమైంది. ఏపీకి ఎలాంటి బొగ్గు నిల్వలనూ కేంద్రం కేటాయించలేదు.

ఈ నేపథ్యంలో ఒడిశాలోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ అవసరాలకు అనుగుణంగా కేటాయించాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రధానిని కోరుతున్నారు. ఈ మేరకు లేఖ రాశారు. ఏపీలో రాజకీయంగా బలోపేతం అంటూ కలలు కంటున్న బీజేపీ వాళ్లు.. ఏపీకి కేంద్రం నుంచి దక్కాల్సిన ఇలాంటి అంశాల గురించి ఎందుకు మాట్లాడరో!