Begin typing your search above and press return to search.

పాడి రైతులకు జగన్ శుభవార్త

By:  Tupaki Desk   |   27 Jun 2020 8:00 AM GMT
పాడి రైతులకు జగన్ శుభవార్త
X
ఏపీలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తున్న సీఎం జగన్ తాజాగా రైతులకు మరో వరమిచ్చారు. తాజాగా పాడి పరిశ్రమకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. సహకార రంగంపై సమీక్ష సందర్భంగా సీఎం జగన్ తాజాగా పాడిరైతులకు శుభవార్త చెప్పారు.

దేశంలోనే అతిపెద్ద డెయిరీ ఉత్పత్తుల సంస్థ ‘అమూల్’తో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకోవాలని సీఎం జగన్ నిర్ణయించారు. పశువులకు మంచి వైద్యం, సంరక్షణ, ఉత్తమ సాంకేతికత,పాల ఉత్పత్తుల మార్కెటింగ్ పై ఈ ఒప్పందం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. జూలై 15లోగా ఈ ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

దీనివల్ల సహకార రంగం బలోపేతంతోపాటు పాడి రైతులకు అదనపు ఆదాయాన్ని కలిగించడమే లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు. పాడి పరిశ్రమ విధానంలో ఇక రైతులను దోచుకునే పరిస్థితి దీంతో ఉండదని జగన్ తెలిపారు.

అమూల్ కంపెనీ ఏపీ పాడి రైతుల నుంచి అధిక ధరకు పాలు, పాల ఉత్పత్తులు కొని వారిని ఆర్థికంగా పరిపుష్టి చేస్తుందని సీఎం జగన్ కు అధికారులు వివరించారు. పాడి రైతుల ఉత్పత్తులకు మంచి రేటు వచ్చేలా చూడాలని జగన్ సూచించారు. అమూల్ కంపెనీతో రాష్ట్ర రైతులకు ఉపయోగపడాలన్నారు.