Begin typing your search above and press return to search.
ప్రజలకు మరో వరమిచ్చిన సీఎం జగన్
By: Tupaki Desk | 27 March 2021 5:45 AM GMTఓటేసిన ప్రజలకు ‘జవాబుదారిగా’ ఉండాల్సిన అవసరం ఉందని సూపర్ స్టార్ మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో చెబుతుంటారు. అలా ఉంటేనే రాజకీయ నేతలకు విలువ అని నొక్కివక్కానిస్తుంటాడు. అయితే అది ఇప్పుడు సీఎం జగన్ ఏపీలో చేసి చూపించారు.
దరఖాస్తులు పట్టుకొని సంవత్సరాల కొద్దీ కలెక్టర్లకు తిరిగే రోజులు ఇక ఏపీలో పోతున్నాయి. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏపీలో ‘స్పందన’ పోర్టల్ ను జగన్ ప్రారంభించారు.
తాజాగా ‘స్పందన’ అనే కొత్త పోర్టల్ ను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు తమ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు. ఇచ్చిన దరఖాస్తు ఏ స్థాయిలో ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
స్పందనలో నమోదైన ఫిర్యాదును ఎందుకు తిరస్కరిస్తున్నారో ఖచ్చితంగా చెప్పాలని.. ఫిర్యాదు పరిష్కారం కాకపోతే ఏ స్థాయిలో నిలిచిపోయిందనే విషయం కూడా తెలియజేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
ఇక అటు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో ఇంటి పట్టా ఇవ్వాలని జగన్ అధికారులకు స్పష్టం చేశారు. జగన్ ప్రారంభించిన ఈ పారదర్శక విధానంపై ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.