Begin typing your search above and press return to search.
ఏపీ సీఎం జగన్ ఫోటోకు తెలంగాణ ఉద్యోగుల పాలాభిషేకం
By: Tupaki Desk | 1 April 2021 7:17 AM GMTతెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చారు. ఆనందంతో స్వీట్లు పంచారు. తమ కష్టాలకు చెల్లుచీటి ఇవ్వటమే కాదు.. అడిగినంతనే స్పందించిన తీరుకు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ తెలంగాణ ఉద్యోగుల్ని ఇంతలా ఆనందానికి గురి చేసిన సీఎం జగన్ నిర్ణయం ఏమిటి? వారెందుకలా రియాక్టు అయ్యారు అన్న విషయంలోకి వెళితే..
ఏపీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారు. వివిధ కారణాలతో వారు.. విభజన వేళ సొంత రాష్ట్రానికి వెళ్లలేకపోయారు. అలా పని చేస్తున్న వారు ఏపీలో 711 మంది ఉన్నారు. విభజన జరిగి ఆరేళ్లు అయిపోయినా.. తమను తమ రాష్ట్రానికి పంపాల్సిందిగా వారు కోరుతున్నారు. వారి విన్నపాలు పాలకుల చెవికి చేరలేదు. ఇదిలా ఉంటే.. 711 మంది ఉద్యోగుల ప్రతినిధులు తాజాగా సీఎం జగన్ ను క్యాంపు కార్యాలయంలో కలిశారు. తమ అభ్యర్థనను ఆయన ముందు ఉంచారు. తాము పడుతున్నకష్టాల్ని జగన్ కు చెప్పుకున్నారు.
వెంటనే స్పందించిన సీఎం జగన్.. వారి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించారు. వారిని ఏపీ నుంచి రిలీవ్ చేసేందుకు ఓకే చెప్పారు. వారిని రిలీవ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. సొంత రాష్ట్రానికి వెళుతున్న ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు చెప్పారు. దీంతో.. తమ రాష్ట్రానికి వెళ్లేందుకు అంగీకరించి.. తమ సమస్యను వెంటనే క్లియర్ చేసిన జగన్ నిర్ణయంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సమాచారం అందుకున్న మిగిలిన ఉద్య్గోగులు జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. టపాసులు పేల్చి.. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. అలా తెలంగాణ ఉద్యోగులు ఏపీ సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.