Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తప్పు పట్టి.. మోడీకి జగన్ రాసిన లేఖ ఇప్పుడెక్కడ?

By:  Tupaki Desk   |   22 March 2021 4:40 AM GMT
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తప్పు పట్టి.. మోడీకి జగన్ రాసిన లేఖ ఇప్పుడెక్కడ?
X
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలంటూ కేంద్రంలోని మోడీ సర్కారు డిసైడ్ చేయటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాల్సిందే అన్నట్లుగా కేంద్రం తీరు ఉన్న నేపథ్యంలో.. విశాఖ ఉక్కును అమ్మొద్దంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి ఒక లేఖ రాయటం తెలిసిందే.

విశాఖ ఉక్కును అమ్మే బదులుగా ప్రత్యామ్నాయాలను చూడాలని ఆ లేఖలో జగన్ కోరారు. మరి.. ఇప్పుడా లేఖ ఎక్కడ ఉంది? ఏ దశలో ఉంది? అన్న వివరాల్ని తెలుసుకోవటం కోసం సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం ద్వారా ఒక లేఖ రాశారు.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు ఎక్కడుంది? దానిపై ఎలాంటి చర్యలు తీసుుకున్నారన్న ప్రశ్నకు పీఎంవో స్పందించింది. ప్రధానికి జగన్ రాసిన లేఖను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ విభాగానికి పంపినట్లు పేర్కొంది. సీఎం జగన్ కు తగిన జవాబు ఇవ్వాలని కోరింది. అయితే.. సదరు సంస్థ మాత్రం సీఎం జగన్ లేఖకు సమాధానం ఇంకా ఇవ్వలేదన్న విషయం తాజాగా తేలింది.