Begin typing your search above and press return to search.
ఒకే రోజు విశాఖలో ఆ ఇద్దరూ... ?
By: Tupaki Desk | 17 Dec 2021 10:30 AM GMTవిశాఖ ఇపుడు పొలిటికల్ హీట్ ని పెంచేలా ఉంది. విశాఖ పరిపాలనా రాజధాని అని జగన్ అన్న దగ్గర నుంచి అనూహ్యంగా ఈ సిటీ ప్రాముఖ్యత పెరిగిపోయింది. విశాఖ మాకూ ఇష్టమే. మా ఫైనాన్స్ రాజధాని అని చంద్రబాబు ఈ రోజుకీ చెబుతారు. విశాఖను మేము చేసినట్లుగా ఎవరైనా అభివృద్ధి చేశారా అన్నది ఆయన సూటి ప్రశ్న. ఇక విశాఖ టీడీపీ కంచుకోటగా ఉంటూ వచ్చింది.
వైసీపీ అధికారంలోకి రావడంతో సిటీని కూడా మెల్లగా తమ వైపునకు తిప్పుకున్నారు. విశాఖ రూరల్ నుంచి అర్బన్ జిల్లా వరకూ అంతా ఫ్యాన్ పార్టీ విజయం సాధించింది. మరి విశాఖకు వైసీపీ సర్కార్ ఇంతవరకూ ఏమైనా చేసిందా అంటే వట్టి మాటలే అని టీడీపీ గట్టిగా విమర్శలు చేస్తుంది. అయితే మేము రాజధాని తెద్దామనుకున్నా టీడీపీ తేనీయడంలేదు అంటూ వైసీపీ ఎదురు దాడి చేస్తుంది.
ఈ వాదనలు ఇలా ఉండగానే విశాఖలో ఇద్దరు అధినాయకులూ తరలిస్తున్నారు. అది కూడా ఒకే రోజున రావడం అంటే విశేషంగా చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్ కి హాజరవుతున్నరు.
అదే టైమ్ లో చంద్రబాబు కూడా విశాఖ వస్తున్నారు. ఆయన విశాఖ సిటీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడి వివాహానికి హాజరవుతున్నారు. చంద్రబాబు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చి కొద్ది సేపు వివాహ మహోత్సవంలో పాలుపంచుకుని మళ్ళీ విశాఖ నుంచి హైదరాబాద్ కి వెళ్ళిపోతారు.
జగన్ సాయంత్రం విశాఖ వస్తే చంద్రబాబు రాత్రి ఎనిమిది ప్రాంతంలో వస్తున్నారు. ఇద్దరు నేతలు ఒక రాత్రి కొంత సేపు విశాఖలో ఒకే సమయంలో ఉండడం అంటే ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న విశేషంగా చెప్పాలి మరి. తమ అధినాయకులు విశాఖకు రావడంతో రెండు పార్టీలలో రాజకీయ కోలాహలం మామూలుగా లేదు మరి.