Begin typing your search above and press return to search.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల కేసులో కీలక సూత్రధారి లొంగుబాటు
By: Tupaki Desk | 25 Sep 2020 3:00 PM GMTఏపీలో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నిధులను నకిలీ చెక్కులతో కొల్లగొట్టిన సూత్రధారి భాస్కర్ రెడ్డి పోలీసులకు లొంగిపోయాడు. కడప జిల్లా చాపాడు మండలం వెంగన్నగారిపల్లెకు చెందిన భాస్కర్ రెడ్డి గురువారం సాయంత్రం ప్రొద్దుటూరు రూరల్, త్రీటౌన్, టూటౌన్ పోలీస్ స్టేషన్లలో లొంగిపోయాడు.
సీఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కుల వ్యవహారం ఏపీలో కలకలం రేపింది. సీఎంఆర్ఎఫ్ నిధులు రూ.117 కోట్లు కొట్టేయాలని ముగ్గురు స్కెచ్ గీశారు. వారిని ఫిర్యాదు మేరకు కేసులు నమోదైంది. అందులో ఒకరు భాస్కర్ రెడ్డి తాజాగా పోలీసులకు లొంగిపోయాడు.
కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన భాస్కర్ రెడ్డి ఈ ఉదంతానికి తెరతీసినట్లు గుర్తించారు. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి సాయం కావాలంటూ కొంత మంది బాధితుల్ని తీసుకెళ్లడం.. తన పలుకుబడిని ఉపయోగించి వారికి సాయం చేయడం చేశాడు. అలా వచ్చిన చెక్కులను తన ఖాతాలో వేసుకోవడం. ఆ మేరకు నగదును మాత్రం బాధితులకు ఇవ్వడం చేశాడు. సీఎంఆర్‌ఎఫ్ నుంచి వచ్చిన చెక్కులను పెద్ద మొత్తంలో ఉన్న అమౌంట్లుగా మార్చి బ్యాంకుల్లో జమ చేసుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించారు.
ఈ కేసులో ఏసీబీ అధికారులు నిన్నంతా సచివాలయంలో.. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నిర్వహణ చూసే ఉద్యోగులను కూడా ప్రశ్నించారు. ఏడాదిన్నర కాలంలో 1500 మంది వరకూ సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చినప్పటికీ అందులో వెయ్యి కూడా లక్షకు మించి లేవు. మిగతావన్నీ లక్షలోపేనని వారు వివరించారు. కానీ అదే సమయంలో వివిధ చెక్కుల పేరుతో డ్రా అయిన పెద్ద మొత్తాల వివరాలు తీసుకున్నారు.
భాస్కర్ రెడ్డి ఫేక్ చెక్కులు క్రియేట్ చేసి ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కత్తా బ్రాంచీల్లో వేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన అంత పెద్ద చెక్కులను ఆయా బ్యాంకుల్లో ఎలా వేయగలిగాడు..? అసలు ఆ కంపెనీలతో భాస్కర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి..? అవి అసలు కంపెనీలా.. నకిలీవా..? అని వెలికితీసే పనిలో పడ్డారు అధికారులు. ఇందుకోసం సీఐడీ మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సీఎంఆర్ఎఫ్ లెక్కలు ఆడిట్ చేస్తే ఎవరెవరికి ఎంతెంత వెళ్లాయి ఎంత డ్రా చేసుకున్నారనేది స్పష్టం అవుతుందని అధికారులు అంటున్నారు.