Begin typing your search above and press return to search.
కో-పైలెట్ కు డ్రగ్స్ ఇచ్చి పైలెట్ అత్యాచారం
By: Tupaki Desk | 16 March 2018 11:30 PM GMTఅత్యాచార కేసుల్లో ఇది మరో చిత్రమైన కేసు. ఓ పైలెట్ తన కో పైలెట్‌పై అత్యాచారయత్నం చేశారు. అలాస్కా ఎయిర్ లైన్స్ పైలట్ తనకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడని కొ పైలట్ బ్రెట్టి పినా విమానయాన సంస్థ పై దావా వేసింది. ఈ ఘటన గత ఏడాది జూన్ లో జరిగిగా ఎయిర్ లైన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినపట్టికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆ పైలెట్ ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నాడు అని బ్రెట్టి ఆరోపించారు. దీంతో ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదు చేశారు.
తాను గత జూన్ లో సదరు పైలట్ తో కలిసి మూడు రోజులు ప్రయాణించాల్సి వచ్చిందని.. ప్రయాణం మధ్యలో విరామ సమయంలో మిన్నియాపొలీస్ లో ఈ ఘటన చోటు చేసుకొన్నట్లు ఆమె చెప్పారు. `హోటల్ లాంజ్‌లో ఉన్న సమయంలో ఆ పైలెట్ వైన్ గ్లాస్ నాకు ఇచ్చాడు.. అది తాగిన తర్వాత తనకు ఏం జరిగిందో తెలియలేదు... కానీ మెలుకువ వచ్చి చూసే సరికి నేను అతనితో పాటు.. బెడ్ పై ఉన్నాను` అని ఫిర్యాదులో పేర్కొంది. అతను తనకు డ్రగ్స్ ఇవ్వడంతో బెడ్ పై వాంతి కూడా చేసుకున్నట్లు.. కొన్ని రోజులు చాలా నీరసంగా ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటన తర్వాత తాను చాలా అనారోగ్యానికి గురైనట్లు తెలిపింది. తాను తీవ్రమైన దాడికి గురి కావడంతో తన 17 ఏళ్ల కెరీర్ ను కోల్పోయినట్లు భయపడ్డానన్నది.
`ఈ విషయం భయట పెట్టడానికి మొదట చాలా ఇబ్బందిగా అనిపించిందని అయితే, అతడి వల్ల మరే ఆడపిల్ల ఇబ్బంది పడకూడదు అని భావించి తనకు జరిగిన అన్యాయం పై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు బాధితురాలు పేర్కొంది. ఈ ఘటనపై తాము విచారణ జరుపుతున్నట్లు తమ సంస్థ ఇటువంటి ఆరోపణలను చాలా సీరియస్ తీసుకొంటుంది అని అలాస్కా ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి బాబ్బీ ఈగన్ చెప్పారు.