Begin typing your search above and press return to search.

యూనివర్సిటీల్లో కోచింగ్

By:  Tupaki Desk   |   29 March 2022 10:30 AM GMT
యూనివర్సిటీల్లో కోచింగ్
X
తెలంగాణా ప్రభుత్వం తొందరలో భర్తీ చేయబోతున్న వేలాది ఉద్యోగాల కోసం ఒక మంచిపని చేస్తోంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఉపయోగంగా ఉంటుందని యూనివర్సిటిల్లోనే కోచింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేసింది. కోచింగ్ కోసమని విద్యార్ధులు బయట కోచింగ్ సెంటర్లలో చేరటం, అందుకని వేలాది రూపాయల ఫీజులు కట్టడం ఎందుకని ప్రభుత్వం ఆలోచించింది.

ఇందులో భాగంగానే అనేక సబ్జెక్టులకు సంబంధించి నిపుణులను, విశ్వవిద్యాలయాల్లోని టీచింగ్ స్టాఫ్ కే విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే బాధ్యతలను అప్పగించింది. విద్యార్ధులకు స్టడీ మెటీరియల్ అందించేందుకు అవసరమైన నిధులు కూడా విడుదల చేసింది. ఇపుడు విద్యార్ధులు ఎలాగూ యూనివర్సిటిల్లోనే చదువుకుంటున్నారు. ఉద్యోగాలు, పరీక్షల కోసం ట్రైనింగ్ తీసుకునేందుకు మళ్ళీ బయటకు వెళతారు. అలా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే కోచింగ్ ఇప్పించాలని అనుకోవటం మంచి నిర్ణయమే.

ప్రభుత్వం నిర్ణయం వల్ల ఉద్యోగ పరీక్షలకు హాజరయ్యే లక్షలాది మంది యువతకు ఎంతో లాభం ఉంటుంది. ఉద్యోగాలు కావాలని అనుకుని, ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటున్న లక్షలాది మంది పేద విద్యార్థులకు ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఎంతో ఉపయోగముంటుంది.

మరి యువత కూడా ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకుని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ఉద్యోగాల భర్తీ విషయంలో కేసీఆర్ ప్రకటన చేయగానే వెంటనే ట్రైనింగ్ సెంటర్లు మొదలైపోయాయి.

ఫీజులని, మెటిరీయలని, అడ్మిషన్లంటు ట్రైనింగ్ కేంద్రాలు హడావుడి మొదలుపెట్టేశాయి. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో అలాంటి ట్రైనింగ్ సెంటర్లపై పెద్ద పిడుగు పడినట్లే అయ్యింది.

ప్రైవేటు ట్రైనింగ్ సెంటర్ లో చేరి వేల రూపాయల ఫీజులు చెల్లించే కన్నా తాము చదువుకుంటున్న యూనివర్సిటిల్లోని టీచింగ్ స్టాఫ్ దగ్గరే ఉద్యోగ పరీక్షలకు కోచింగ్ తీసుకోవటం ఎంతో మంచిది.