Begin typing your search above and press return to search.

బీరు - బ్రీజరుకు మధ్యరకంగా కోకోకోలా డ్రింక్

By:  Tupaki Desk   |   28 May 2018 11:30 PM GMT
బీరు - బ్రీజరుకు మధ్యరకంగా కోకోకోలా డ్రింక్
X
కోకోకోలా మద్యం వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఆల్కహాల్ అన్న పేరు లేకుండా ఆల్కోపాప్(మద్యం శాతం తక్కువ స్థాయిలో కలిగిన పానీయం) ఉత్పత్తుల పేరిట వీటిని ఈ రోజు విడుదల చేసింది. అయితే.. ఇది ప్రస్తుతం దక్షిణ జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో మాత్రమే అందుబాటులోకి తెచ్చింది. మహిళలు - యువత లక్ష్యంగా తీసుకొచ్చిన దీన్ని ‘లెమన్ డు’గా పిలుస్తున్నారు.

అయితే.. జపాన్ మార్కెట్లో నిలదొక్కుకోవడం కోకోకోలాకు అంత సులభం కాదని తెలుస్తోంది. మరోవైపు కోకోకోలా ఇలా ఆల్కహాలిక్ డ్రింకు తీసుకురావడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు కూడా ఓసారి ఇలాగే ప్రవేశపెట్టినా మళ్లీ ఆపేసింది.

కాగా... ప్రస్తుతం విడుదల చేసిన మూడు రకాల ఆల్కోపాప్‌లలో 3% - 8% వరకూ ఆల్కహాల్ ఉంటుంది. జపాన్‌ లోని ప్రఖ్యాత 'చూ-హై' రకం పానీయాల నమూనాలో ఈ ఆల్కోపాప్‌ లను విడుదల చేసింది. ఈ చూ-హై పానీయాలు.. స్థానికంగా లభించే స్పిరిట్ - వివిధ పండ్ల రసాలతో కలిసి చేస్తారు. ఈ ద్రావకాన్ని 'బీర్‌' కు ప్రత్యామ్నాయంగా మార్కెట్ లో అమ్ముతున్నారు.

జపాన్‌లో లభించే చూ-హై రకం పానీయాల్లో సాన్తొరీ -ఆసాహీ - కిరిన్ కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. ఈ కంపెనీ ఉత్పత్తుల్లో ద్రాక్ష - నిమ్మ రుచులకు మంచి ఆదరణ ఉంది. మహిళలు వీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. దీంతో కోకోకోలా కూడా ఇప్పుడు మహిళలు లక్ష్యంగా బ్రీజర్ కంటే కాస్త మత్తుతో బీరు కంటే తక్కువ మత్తుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది.