Begin typing your search above and press return to search.

కోర్టు కోర్టే...పందాలు పందాలే

By:  Tupaki Desk   |   14 Jan 2016 9:08 AM GMT
కోర్టు కోర్టే...పందాలు పందాలే
X
తెలుగు ప్ర‌జ‌ల పండుగ సంక్రాంతితో ప్ర‌జ‌ల లోగిళ్లు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. మూడు రోజులపాటు క‌న్నుల పండువ‌గా సాగే సంక్రాంతి సంబురంలో మొదటి రోజు భోగి ఆనందాలు వెల్లివిరిస్తున్నాయి. ఇదే సమయంలో తెలుగు సంప్రదాయంలో భాగమైన కోళ్ల పందాలు సైతం అరిస్తున్నాయి.

కోస్తాలో ప్రాచుర్యం పొందిన కోళ్ల పందాలను జ‌ర‌గ‌కుండా చూడాల‌ని ప‌లువురు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో పందాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాల‌ని హైకోర్టు ప్రభుత్వాన్నిఆదేశించింది. అయితే ప్ర‌జ‌లంతా ఉత్సుక‌త‌తో పాల్గొనే కార్య‌క్ర‌మం కావ‌డం, చ‌ట్టాల‌ను, ఆదేశాల‌ను పాటించాల్సిన వ‌ర్గాలు కూడా సంప్రదాయాల్లో భాగ‌స్వామ్యం కావాల్సి వ‌స్తుండ‌టంతో కోర్టు కోర్టే....పందాలు పందాలే అన్న‌ట్లుగా కోళ్ల‌పందాలు సాగిపోతున్నాయి.

కోళ్ల పందాలు ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతున్నాయని స‌మాచారం. భోగి సంద‌ర్భంగా ఔత్సాహికులు ఏర్పాటుచేసిన బ‌రుల‌ను పలువురు ప్రజాప్రతినిధులే ప్రారంభించడం ఆస‌క్తిక‌రం. భీమవరం, తణుకు, అమలాపురం, కైకలూరు తదితర ప్రాంతాల్లో కోళ్ల పందాలు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ప్ర‌జ‌లంతా పాల్గొనే కార్య‌క్ర‌మం కావ‌డంతో పందాల జోరు సాగుతూనే ఉంది.