Begin typing your search above and press return to search.
సంక్రాంతి రాకముందే..కోడిపందాలు షురూ
By: Tupaki Desk | 26 Dec 2017 8:07 AM GMTసంక్రాంతి కోడి పందాల ‘బరి’తెగింపు మొదలైంది. చిత్రంగా పండగకు ముందే ఈ సందడి షురూ అయింది. గోదావరి జిల్లాల్లో సంప్రదాయ కోడి పందాల మాటున రూ.కోట్ల టర్నోవర్ లో పందాలకు తెరలేస్తోంది. గోదావరి జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు పేరొందిన ప్రాంతాల్లో రూ. లక్షలు ఖర్చుచేసి బరులు ముస్తాబవుతున్నాయి. పందాల కోసం అవసరమైన నగదు కోసం ఆస్తులను తాకట్టు పెట్టడానికి సైతం పలువురు పందాలరాయుళ్లు సిద్ధమవుతున్నారు. పందెం బరులకు అనుబంధంగా ఏటా మాదిరిగానే గుండాటలు - పేకాటలు - మద్యం దుకాణాలతో పాటు ఈసారి అశ్లీల నృత్యాల ఏర్పాటుకు సైతం ప్రయత్నాలు సాగుతున్నట్టు సమాచారం.
`న్యాయస్థానాలను గౌరవిస్తాం... సాంప్రదాయాలనూ గౌరవిస్తాం’ అంటూ నర్మగర్భంగా ప్రభుత్వ పెద్దలు చేస్తున్న వ్యాఖ్యలు ఈ ఏడాది ముందుగానే గోదావరి జిల్లాలకు కోడిపందాల ఊపును తీసుకొచ్చాయని అంటున్నారు. గోదావరి జిల్లాల్లో చిన్న చిన్న పందెం బరులు రూ.25 నుంచి రూ.50 కోట్ల లోపు స్థాయిలో గ్రామాల్లో జరుగుతాయి. పేరు మోసిన కేంద్రాల్లో మాత్రం కనీసం రూ.100 కోట్లకు తగ్గకుండా పందాల పేరిట డబ్బు చేతులు మారనుంది. ఏటా సంక్రాంతి మూడు రోజులు గోదావరి జిల్లాలు కోడి పందాలకు - ఇతర జూదాలకు అడ్డాలుగా మారుతున్నాయి. సినిమా పెద్దల కోసం షూటింగ్ ప్రాంతాల్లో సేదతీరడానికి ఏర్పాటు చేసే ‘కార్ వాన్’ విధానం ఈసారి పందాల వద్ద ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పందాలకు ఊపునిచ్చేందుకు బడా బాబుల కోసం ఏసీ డెన్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఏసీ డెన్ లలో హైటెక్ వ్యభిచారానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
కాగా, ధనుర్మాసం మొదలైప్పటి నుంచి గోదావరి జిల్లాల్లో కత్తులు నూరడం ఆరంభమయ్యింది. కోడి పందాల వ్యవహారంలో ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. పందెం బరులకు అనుబంధంగా మద్యం విక్రయాలే దాదాపు రూ. 500 కోట్లు ఉంటుందని ఎక్సైజ్ శాఖ అనధికార అంచనాగా వుంది. గ్రామాల్లో నాటు సారా విక్రయాలు కూడా రూ. కోట్లలోనే వుంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి - కాళ్ళకూరు - జువ్వలపాలెం - భీమవరం ప్రకృతి ఆశ్రమం - అయి భీమవరం - మహాదేవపట్నం - అన్నవరం - కోరుకొల్లు - కొవ్వాడ - భీమవరం - యలమంచిలి - మొగల్తూరుతో పాటు జంగారెడ్డిగూడెం - శ్రీనివాసపురంలో జోరుగా పందాల బరులు తయారవుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇక తూర్పు గోదావరి జిల్లాలోని అయి పోలవరం - మురమళ్ళ - ముమ్మిడివరం - కాట్రేనికోన - సఖినేటిపల్లి - మామిడికుదురు - మల్కిపురం - రాజోలు - రావులపాలెం - ఆత్రేయపురం తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున పందాలకు రంగం సిద్ధమైంది. డబ్బు సంచులతో బడాబాబులు - అనుబంధ జూదాల మాఫియా బ్యాచ్ లు - వడ్డీ వ్యాపారులు గోదావరి జిల్లాల్లో ముందుగానే బరులకు సమీపంలో మకాం చేస్తున్నారు. లాడ్జిలు - కాన్ఫరెన్స్ హాలులు నిండిపోయాయి. ఈసారి వెరైటీగా ఆన్ లైన్ లో పందాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. పుంజుల మధ్య వైరాన్ని రగిల్చి - కత్తులతో తలపడే పందాల క్రీడా వినోదంలో ఈసారి పందెం కోళ్లకు స్టెరాయిడ్ లను కూడా వినియోగిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.