Begin typing your search above and press return to search.
అమెజానా మజాకానా..కొబ్బరి చిప్ప@రూ.1400
By: Tupaki Desk | 16 Jan 2019 9:23 AM GMTకొనేటోళ్లు ఉండాలే కానీ అమ్మేటోళ్లు ఏమైనా అమ్మేస్తారు. ఈ మాటను తగ్గట్లే ప్రముఖ ఆన్ లైన్ సంస్థ అమెజాన్ ఖాళీ కొబ్బరి చిప్పల్ని అమ్మేస్తోంది. అది కూడా ఒక్కో చిప్ప రూ.1400 సుమా. ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజాల్లో ఒకటైన అమెజాన్ లక్షలాది ఉత్పత్తుల్ని అమ్ముతుంటుంది. అలా అమ్మే వస్తువుల్లో ఈ కొబ్బరి చిప్ప వ్యవహారం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సాధారణంగా కొబ్బరి కాయ రూ.20 నుంచి రూ.30 వరకూ ఉంటుంది. ఇక.. కొబ్బరికాయలోని నీళ్లు.. కొబ్బరి తీసేసిన తర్వాత చిప్పల్ని చెత్తలో పడేస్తుంటారు. అలాంటి చిప్పల్ని ఒక్కొక్కటి రూ.1400 చొప్పున ఎలా అమ్ముతున్నారు? జనాలు ఎందుకు కొంటున్నారంటారా? అక్కడికే వస్తున్నాం.
ఇటీవల కాలంలో కొబ్బరి చిప్పలతో చేసిన బౌల్స్ వాడకం పెరిగింది. నేచురల్ బౌల్స్ పేరుతో ఈ కొబ్బరి చిప్పల్ని చక్కగా పాలిష్ చేసేసి అమ్మేస్తున్నారు. ట్రెండింగ్ గా మారిన ఈ కొనుగోళ్లను అందిపుచ్చుకున్న అమెజాన్.. తన సైట్ లో వీటికి స్థానం ఇచ్చింది. కాకుంటే.. ఈ ఎపిసోడ్ లో ఇంట్రస్టింగ్ అంశం ఏమంటే..ఈ కొబ్బరిచిప్ప అసలు రేటు రూ.3వేలని.. కానీ తాము 55 శాతం ఆఫర్ ఇవ్వటంతో దాన్ని రూ.1365కే అమ్ముతున్నట్లుగా ఊరిస్తోంది.
ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారిణి రెమో రాజేశ్వరి చూసి.. ఆశ్చర్యపోయారు. ఈ వ్యవహారాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేవారు. సరిగ్గా వంద మిల్లీ లీటర్ల నీళ్లు పట్టేంత ఖాళీ ఉన్న ఈ చిప్పను ఇంతేసి రేటు పెట్టి అమ్ముతున్న వైనంపై ఆమె ట్విట్టర్ లో ట్వీట్ రూపంలో పేర్కొన్నారు. ఎప్పటిలానే.. నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు