Begin typing your search above and press return to search.
కెల్విన్ కోడ్ డీ కోడ్ చేయటమే పెద్ద పని
By: Tupaki Desk | 16 July 2017 9:36 AM GMTస్కూల్ నుంచి సినీ ఇండస్ట్రీ వరకూ డ్రగ్స్ మార్కెట్ ను విస్తరించినోడు కెల్విన్. అతడి పుణ్యమా అని ఇప్పుడు చాలా రంగాల్లోని ప్రముఖులకు చెమటలు పడుతున్న పరిస్థితి. ప్రముఖులకు నేరుగా కెల్విన్ తో సంబంధాలు లేకున్నా.. వారి పిల్లల్లో.. అయిన వారో కావటం ఇప్పుడు పెద్ద చిక్కుగా మారింది. డ్రగ్స్ తో సంబంధం ఉన్న కెల్విన్ ను విచారించిన అధికారులకు.. విచారణలో భాగంగా సంచలన విషయాలు బయటపెట్టినట్లుగా చెబుతున్నారు. డ్రగ్స్ గురించి మాట్లాడేటప్పుడు.. వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేటప్పుడు కోడ్ భాషలో మాట్లాడేవాడని చెబుతున్నారు.
పలు రంగాలకు చెందిన వారికి డ్రగ్స్ సరఫరా చేసిన కెల్విన్.. తన దందాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రముఖులతో పరిచయాలు ఎలా పెంచుకున్నాడు? వారికి ఎలా సరఫరా చేసే వాడన్న విషయం మీద పోలీసులు ఎక్కువ దృష్టిపెట్టినట్లుగా తెలుస్తోంది.
సినీ ప్రముఖులకు డ్రగ్స్ ను సరఫరా చేసే సమయంలో కోడ్ భాషలోనే ఈ పని చేసేవాడని గుర్తించారు. డ్రగ్స్ ను పేపర్ పేరుతో పిలిచేవాడని.. బోయ్ అంటే కొరియర్ అని పిలిచేవాడని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. వివిధ సామాజిక మాధ్యమాలు వాట్సప్.. ఫేస్ బుక్.. ఇలా అన్ని మాథ్యమాల ద్వారా డ్రగ్స్ ను సరఫరా చేసేవాడని చెబుతున్నారు. నాలుగేళ్ల క్రితం సినీ వర్గాలతో కెల్విన్‌కు తొలిసారి పరిచయం అయ్యిందని తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులతో ఫోన్లో టచ్ లో ఉండేవాడని.. కొన్ని సందర్భాల్లో ఛాటింగ్ చేసేవాడని చెబుతున్నారు. ఒక దర్శకుడితో కెల్విన్ 185 సార్లు మాట్లాడినట్లుగా విచారణ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కోడ్ రూపంలో ఇచ్చిన ఆర్డర్‌ను.. అదే విధంగా మరో కోడ్ రూపంలో డెలివరీ చేసేవాడని తెలుస్తోంది. కెల్విన్ కోడ్ ను డీ కోడ్ చేయటం ఇప్పుడు పెద్ద పనిగా మారిందని తెలుస్తోంది. ఇక.. ఈ కేసులో అత్యంత కీలకమైన కెల్విన్ ఫోన్ లో ఒక రహస్య ఫోల్డర్ ఉందని.. అందులో విలువైన సమాచారం ఉన్నట్లుగా భావిస్తున్నారు. దాన్ని ఓపెన్ చేయటం ఇప్పుడు కష్టంగా మారిందంటున్నారు. ఆ రహస్య ఫోల్డర్‌ను ఓపెన్ చేస్తే.. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈజీగా బయటకు వచ్చేస్తాయని చెబుతున్నారు. కెల్విన్‌కు సంబంధించిన మూడు సిమ్ కార్డుల్ని సేకరించిన అధికారులు.. వాటి కాల్ డేటాతో పాటు.. మెసేజ్ లతో సహా అన్ని అంశాల మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా కెల్విన్ ఫోన్.. అతను వాడిన సిమ్ కార్డులు.. ప్రముఖుల ఫ్యూచర్‌ను డిసైడ్ చేస్తాయన్న మాట వినిపిస్తోంది.