Begin typing your search above and press return to search.

రూ.1 ఇడ్లీఅవ్వ కష్టాలు తీర్చిన మహీంద్ర

By:  Tupaki Desk   |   12 Sep 2019 6:22 AM GMT
రూ.1 ఇడ్లీఅవ్వ కష్టాలు తీర్చిన మహీంద్ర
X
ఆనంద్ మహీంద్రా దేశంలోనే బడా పారిశ్రామిక వేత్తల్లో ఒకరు. ట్విట్టర్ లో యమ యాక్టివ్ గా ఉంటారు. దేశ - అంతర్జాతీయ విషయాలపై స్పందిస్తుంటారు. ఆపదలో ఉండేవారిని ఆదుకుంటారు.. స్ఫూర్తినిచ్చేవారిని పొగుడుతుంటారు. ఇటీవలే పాక్ ప్రధాని అమయాకత్వాన్ని ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు.

తాజాగా తమిళనాడులోని పెరూ సమీపంలోని వడివేలం పాళ్యంలో రూ.1కే ఇడ్లీ సాంబర్ - చట్నీ అమ్ముతూ పేదల ఆకలి తీరుస్తున్న వృద్ధురాలు కమలతల్ గురించి సోషల్ మీడియాలో తెలుసుకున్నారు. 35 ఏళ్లుగా ఆమె కట్టెల పొయ్యిపైనే పేదల కోసం రూపాయి లాభం ఆశించకుండా ఆకలి తీరుస్తున్న వైనానికి ఆనంద్ మహీంధ్ర ఫిదా అయ్యాడు..

కమలతల్ అడ్రస్ తెలిస్తే చెప్పాలని ఆమె సంకల్పంలో తాను పెట్టుబడి పెట్టి ఆమెకు భరోసాగా నిలుస్తానని.. ఆమెకు ఒక మంచి గ్యాస్ స్టౌవ్ కొనిచ్చి కట్టెల పొయ్యికి స్వస్తి పలుకుతానని ట్విట్టర్ లో పిలుపునిచ్చాడు..

దీనికి స్పందించిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఆమె అడ్రస్ తెలుసుకొని ఆమె గ్యాస్ - స్టవ్ - రెగ్యులేటర్ సెట్ ను ఉచితంగా అందజేసి ఉదారత చాటుకుంది. ఆ ఫొటోను ఆనంద్ మహీంద్ర తాజాగా ట్వీట్ చేశారు. తాను చేయాలనుకున్న పనిని ఇండియన్ ఆయిల్ చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. తాను ఆమెకు అండగా నిలుస్తానని ప్రకటించారు. ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఓ మంచి పనికోసం ఆయన పడ్డ తపనను నెటిజన్లు అభినందిస్తున్నారు.