Begin typing your search above and press return to search.

కల్నల్ కి 9 ఏళ్ల కూతురు నివాళి ...ఫోటో వైరల్ !

By:  Tupaki Desk   |   17 Jun 2020 5:35 PM IST
కల్నల్ కి 9 ఏళ్ల కూతురు నివాళి ...ఫోటో వైరల్  !
X
లద్దాఖ్ సమీపంలోని గాల్వన్ లోయలో ఇండియా, చైనా సైనికులకు మధ్య జరిగిన ఘర్షణల్లో భారీగా ప్రాణ నష్టం జరిగింది. 20 మంది భారత సైనికులు అమరులైయ్యారు. ఆ ఘర్ష‌ణ‌లో తెలంగాణ బిడ్డ‌, సూర్యాపేట నివాసి క‌ల్న‌ల్ బిక్కుమ‌ళ్ల సంతోష్ వీర‌మ‌ర‌ణం పొందారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సంతోష్ బాబు 9 సంవత్సరాల కూతురు అభిగ్నా తండ్రి ఫోటోకు నివాళి అర్పిస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన పలువురిని కంటతడి పెట్టిస్తోంది. తూర్పు లడఖ్ లోని వ్యాలీలోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సమీపంలో సోమ‌వారం రాత్రి చైనా సైన్యంతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన 20మంది భారత సైనికుల్లో సంతోష్ బాబు ఒకరు.

కాగా, ఇండియా, చైనా సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా 20 మంది సైనికులు చనిపోవడం సహా సరిహద్దుల్లో ఏ విధంగా వ్యవహరించాలనే అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ సమావేశంలో వివిధ పార్టీలకు చెందినప్రతినిధులు పాల్గొంటారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అంతకుముందు త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యున్నత సమావేశం నిర్వహించారు. చైనా, భారత్ సరిహద్దుల్లోని పరిస్థితి పై సమీక్షించారు. భారత సైనికులను కోల్పోవడం ఎంతో కలచి వేస్తోందని. ఇది ఎంతో బాధాకరమని ట్వీట్ చేశారు.