Begin typing your search above and press return to search.

ఎర్ర‌బెల్లి హ‌వాకు క‌డియం బ్రేకులు..!

By:  Tupaki Desk   |   1 July 2016 9:43 AM GMT
ఎర్ర‌బెల్లి హ‌వాకు క‌డియం బ్రేకులు..!
X
తెలంగాణ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీహ‌రి.. త‌న పాత మిత్రుడు - ప్ర‌స్తుతం టీఆర్ ఎస్‌లో ఉన్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావుకి చెక్ పెడు తున్నారా? ఈ నేప‌థ్యంలోనే జన‌గామను ప్ర‌త్యేక జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ఆయ‌న అడ్డుకున్నారా? అంటే ఔన‌నే అంటున్నాయి.. రాజ‌కీయ వ‌ర్గాలు. వ‌రంగ‌ల్‌లో జిల్లాలో రాజ‌కీయ ఆధిప‌త్యం కోసం జ‌రుగుతున్న పోరులో ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ నాయ‌కులు ఎత్తుకు పైఎత్తులు వేసుకునే క్ర‌మంలో క‌డియం ఎర్ర‌బెల్లి దూకుడుకు బ్రేకులు వేయాల‌ని చూస్తున్నారాట‌.

రెండేళ్ల క్రిత‌మే టీఆర్ ఎస్ లో చేరి ఉప‌ముఖ్య‌మంత్రి గా ఉన్న క‌డియం శ్రీహ‌రి - ఇటీవ‌లే టీ.టీడీపీ నుంచి టీఆర్ ఎస్ లోకి వ‌చ్చిన ఎర్ర‌బెల్లి వ‌రంగ‌ల్ జిల్లాపై పట్టుకోసం ప‌ర‌స్ప‌రం ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. ఈ విష‌యంలో రెండాకులు ఎక్కువే చ‌దివిన క‌డియం.. ఎలాగైనా త‌న ఆధిప‌త్యాన్ని నిలుపుకొనే క్ర‌మంలో.. ఎర్ర‌బెల్లి ప్రాబ‌ల్యం పెర‌గ‌కుండా ఏ అవ‌కాశం వ‌స్తే దానిని త‌న‌కు అనుకూలంగా వాడుకుంటున్నార‌ట‌!

తాజాగా.. తెలంగాణా సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణా నినాదంలో భాగంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. వ‌రంగ‌ల్ జిల్లా నుంచి కొత్తగా రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇందులో ఒక‌టి భూపాల‌ప‌ల్లి కాగా మ‌రొక‌టి మ‌హ‌బూబాబాద్. అయితే మొద‌ట్లో ప్ర‌తిపాదిత జిల్లాల జాబితాలో ఉన్న జ‌న‌గాం అనూహ్యంగా వెన‌క్కి వెళ్లిపోయింది. దీనికి క‌డియం కార‌ణ‌మ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జ‌న‌గానం జిల్లాగా ఏర్ప‌డితే ఎర్ర‌బెల్లి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పాల‌కుర్తితో పాటు మొత్తం జిల్లా అంతా ఆయ‌న ఆధీనంలోకి వెళ్లిపోతుంద‌ని భావించిన‌ క‌డియం దీన్ని అడ్డుకున్నార‌ని టాక్. దీంతో ఇప్పుడు క‌డియం - ఎర్ర‌బెల్లి ల మ‌ధ్య సీరియ‌స్ గా కోల్డ్ వార్ న‌డుస్తోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.