Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ లో అగ్నిపర్వతం.. ఎప్పుడు బద్దలవుద్ది?

By:  Tupaki Desk   |   5 March 2020 8:30 PM GMT
టీఆర్ ఎస్ లో అగ్నిపర్వతం.. ఎప్పుడు బద్దలవుద్ది?
X
కారు ఓవర్ లోడ్ అయ్యింది. టీఆర్ఎస్ అధికారంలోకి రెండు సార్లు రావడంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నుంచి నేతలు పెద్ద ఎత్తున గులాబీ పార్టీలోకి వలస వచ్చారు. ఇప్పుడు ఉన్న పదవులే తక్కువ. అందరినీ సర్దుబాటు చేయడం కష్టమవుతోంది. సీనియర్లను కాదని...జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడంతో వారంతా గుర్రుగా ఉన్నారు. దీంతో జిల్లాల్లో ఇప్పుడు సీనియర్లు, వర్సెస్ జూనియర్లు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉందట... మంత్రులు, మంత్రులకే కాదు.. సీనియర్లకు మంత్రులకు మధ్య ఆధిపత్య పోరు గులాబీ పార్టీలో పీక్ స్టేజ్ లో ఉందట..

ఉమ్మడి వరంగల్ జిల్లాకు తనే బాస్ అనుకొని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యవహరిస్తుండగా... ఆయనకు పోటీగా మరో మంత్రి సత్యవతి రాథోడ్ సైతం ఆధిపత్యాన్ని చాటుకోవడం ఇద్దరి మధ్య విభేదాలకు దారితీస్తోంది. దీనిపై హైకమాండ్ కు ఫిర్యాదులందాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అయితే ఏకంగా నలుగురు మంత్రులు కేబినెట్ లో ఉన్నారు. కేటీఆర్ ను పక్కనపెడితే ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ల మధ్య ప్రొటోకాల్ సమస్య పీక్ స్టేజ్ లో నడుస్తోంది.

ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు పడడం లేదు. ఖమ్మంలో జూనియర్ అయిన మంత్రి పువ్వాడకు, సీనియర్లు తుమ్మల, పొంగులేటి ఇతర ఎమ్మెల్యేలకు మధ్య నివురుగప్పిన నిప్పులా పరిస్థితి ఉంది.

ఇక నల్గొండ జిల్లా మంత్రి జగదీష్ రెడ్డికి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ప్రచారం సాగుతోంది. రంగారెడ్డి జల్లాలో సబిత, మల్లారెడ్డి ఫైట్, మధ్యలో పట్నం మహేందర్ రెడ్డి మధ్య వార్ నడుస్తోందట... ఇలా గులాబీ పార్టీలో మంత్రులు, నేతల మధ్య ఆదిపత్య పోరు పతాక స్థాయిలో సాగుతోందని పార్టీలో చర్చ సాగుతోంది.