Begin typing your search above and press return to search.

బాబు నిర్ణ‌యానికి కోర్టు నో

By:  Tupaki Desk   |   6 Jan 2016 4:27 PM GMT
బాబు నిర్ణ‌యానికి కోర్టు నో
X
నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం ప్రతి విద్యార్థి నుంచి రూ.10 సేకరించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సేకరణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఇవ్వాల‌ని విద్యాశాఖ క‌మిష‌న‌ర్ నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిపై ప‌లువురు హైకోర్టును ఆశ్ర‌యించ‌గా కోర్టు ఆ ఫిర్యాదుల‌ను స్వీక‌రించి విచార‌ణ చేప‌ట్టింది. విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా రూ.10 చెల్లించాల‌ని విద్యాశాఖ ఎలా ఆదేశిస్తుంద‌ని న్యాయస్థానం ప్ర‌శ్నించింది. ఈ నిర్ణ‌యం స‌రికాద‌ని పేర్కొంటూ ఉత్త‌ర్వుల‌పై స్టే విధించింది.

రాజ‌ధాని నిర్మాణం కోసం రూ.10 ఇవ్వాల్సిందేనని ఆదేశాలు ఇవ్వ‌డంపై ప్ర‌తిప‌క్షాలు - ప్ర‌జా సంఘాలు - విద్యార్థి సంఘాలు - ప్రజాస్వామ్య‌వాదుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంత‌రాలు వ‌చ్చాయి. ప‌లువురు కోర్టును ఆశ్ర‌యించే స్థాయికి ప‌రిస్థితి చేర‌డం త‌ప్పుడు నిర్ణ‌యానికి చిహ్నంగా భావిస్తున్నారు.