Begin typing your search above and press return to search.
కడియం అవాక్కయేలా చేసిన కలెక్టరమ్మ
By: Tupaki Desk | 25 May 2017 4:47 AM GMTఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి అనూహ్యమైన షాక్ ఇచ్చారు. ఇంటర్వ్యూలో అబద్దాలాడక తప్పదని పిలుపునిచ్చారు. నిజాయితీగా ఉంటే ఉద్యోగాలు రావన్నారు. సాక్ష్యత్తూ ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి సాక్షిగా అబద్దాన్ని అందంగా చెప్పాలని కలెక్టరమ్మ పిలుపునివ్వడంతో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అవాక్కయ్యారు. అందుకే ఆ వెంటనే కలెక్టరమ్మకు కౌంటర్ ఇచ్చారు.
వరంగల్ లోని ఐటీఐ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో జిల్లా కలెక్టర్, మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమ్రపాలి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. అవసరమైతే అబద్ధాలు ఆడొచ్చని కుండ బద్దలు కొట్టినట్టు తెలిపారు. కలెక్టర్ వాఖ్యలు విన్న నిరుద్యోగ అభ్యర్థులు అవాక్కవ్వగా.. అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఖంగుతిన్నారు. ఉద్యోగ నియామకాల్లో అబద్దం ఆడే అవకాశం ఉండదని చెప్పిన కడియం శ్రీహరి కలెక్టర్ అమ్రపాలి మాటలు నమ్మి అబద్దాలు ఆడితే అడ్డంగా బుక్ అవుతారని అన్నారు. అభ్యర్ధులు జాగ్రత్తగా ఉండాలని, ఇంటర్వ్యూలలో అబద్దాలు చెప్పకపోవడమే మంచిదని కడియం సూచించారు. ఐఏఎస్ స్ధాయి అధికారిణి ఇలా మాట్లాడటం, దానికి ఉపముఖ్యమంత్రి కౌంటర్ ఇవ్వడం జాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగులను ఆశ్చర్యానికి గురిచేశాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/