Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో కేసీఆర్ మెచ్చిన కలెక్టర్?

By:  Tupaki Desk   |   15 Nov 2021 10:30 AM GMT
తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో కేసీఆర్ మెచ్చిన కలెక్టర్?
X
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఏపీలో దాదాపు అందరు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలో మాత్రం ఇంకా ఫైనల్ చేసే పనిలో కేసీఆర్ నిమగ్నమయ్యారు.

స్థానిక సంస్థల కోటాలో కేసీఆర్ ఎంతో మెచ్చినా.. ప్రశంసలు కురిపించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ పోటీచేయబోతున్నట్టు సమాచారం. ఈమేరకు ఆయన ఈరోజు తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎష్) కోరుతూ సీఎస్ సోమేశ్ కుమార్ కు రాజీనామా లేఖ అందించారు. ఇక వెంకటరమణారెడ్డి వీఆర్ఎస్ ను ఆమోదిస్తూ ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన అధికార టీఆర్ఎస్ లో చేరనున్నట్టు తెలిసింది.

వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. గతంలో సిద్దిపేట కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కలెక్టర్ వెంకటరామిరెడ్డి స్వయంగా కేసీఆర్ పాదాలకు నమస్కారం చేయడం దుమారం రేపింది. సీఎం సొంత జిల్లా సిద్దిపేటను అభివృద్ధి, సంక్షేమం చేయడంలో వెంకట్రామిరెడ్డి ఎంతో బాగా పనిచేశారన్న పేరుంది.కేసీఆర్ స్వయంగా మెచ్చుకున్నారు.

ఈ క్రమంలోనే వెంకటరామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడానికి కేసీఆర్ డిసైడ్ అయ్యాడని తెలిసింది. ఇప్పటికే ఈ కలెక్టర్ పేరు ఎన్నికొలచ్చిన ప్రతీసారి తెరపైకి వస్తోంది. హుజూరాబాద్ బరిలో కూడా వినిపించింది. ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం దక్కినట్లు సమాచారం.

కాగా రాజీనామా ఆమోదం అనంతరం వెంకటరామిరెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల కోసం కృషి చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ లో చేరి ప్రజల కోసం పనిచేస్తానని వెంకటరామిరెడ్డి తెలిపారు.