Begin typing your search above and press return to search.

చంద్రబాబు కళ్లు తెరిపించిన ఐఏఎస్ లు

By:  Tupaki Desk   |   23 Dec 2016 8:30 PM GMT
చంద్రబాబు కళ్లు తెరిపించిన ఐఏఎస్ లు
X
ఏపీ సీఎం చంద్రబాబుతో మీటింగంటే అది వన్ వే కమ్యూనికేషనే. ఆయన మాట్లాడడమే తప్ప వేరే వారు చెప్పడానికీ ఏమీ ఉండదు. చెప్పినా ఆయన వినిపించుకోరు. చంద్రబాబు అంటే సీతయ్య టైపన్న సంగతి అందరికీ తెలియడంతో ఆయనకెవరూ ఏమీ చెప్పడం మానేశారు. దీంతోనే ఆయన నిత్యం సమావేశాలు - టెలికాన్ఫరెన్సులు - వీడియో కాన్ఫరెన్సులు అంటూ పని చెడగొడుతున్నా అధికారులు విసుక్కుంటున్నారే కానీ ఆయనతో మాత్రం అసలు విషయం చెప్పడం లేదు. కానీ.. ఏమైందో ఏమో ఇటీవల మాత్రం కొందరు అధికారులు కలెక్టర్ల మీటింగు తరువాత తమ మనసులో ఉన్నదంతా బయటకు కక్కేశారట. దీంతో చంద్రబాబుకు షాక్ తగిలినంత పనయిందని టాక్.

కలెక్టర్ల సమావేశంలో చంద్ర‌బాబు మాట్లాడ‌టం అయిన త‌ర్వాత అధికారుల నుంచి సూచ‌న‌లూ - స‌ల‌హాలు కోరారట. దీంతో పలువురు అధికారులు ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు. ‘‘మీరు తెల్ల‌వారు జామునే టెలీక‌న్ఫ‌రెన్స్ లు పెడుతున్నారు. ఉద‌యం అంతా అదే ప‌ని స‌రిపోతుంది. అధికారులెవ‌రూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండలేక పోతున్నారు. దీనివ‌ల్ల ప్ర‌జాస‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావ‌డం లేదు. సాక్షాత్తు మీరు ఇచ్చిన హామీలు కూడా నెర‌వేర్చ‌లేక‌పోతున్నాం. దీనివ‌ల్ల ప్ర‌భుత్వానికే చెడ్డ‌పేరు వ‌స్తుంది. క‌లెక్టర్ల స‌మావేశం ఒక్క‌రోజు స‌రిపోతుంది. రెండురోజుల పాటు అవ‌స‌రం లేదు. ప్ర‌భుత్వ విధానం ఏమిటో చెప్పి దాన్ని సాధించేలా ల‌క్ష్యాలు నిర్దేశిస్తే అధికారులు ప‌నిచేసుకుంటూ పోతారు. ఇలా రోజుల త‌ర‌బ‌డి స‌మావేశాల వ‌ల్ల ఉప‌యోగం పెద్ద‌గా ఏమీ ఉండ‌దు’’ అని కుండబద్దలు కొట్టేశారట.

నిత్యం స‌మావేశాలు..రిపోర్టుల వ‌ల్ల ఒరిగేదీమీ ఉండ‌దు. నివేదికలు చాలా వ‌ర‌కూ మిమ్మ‌ల్ని(సిఎం.) ప్లీజ్ చేయ‌డానికే అన్న‌ట్లు ఉంటున్నాయని.. దీనివ‌ల్ల క్షేత్ర‌స్థాయిలో జ‌రిగేది ఏమీ ఉండ‌దు అని అనేస‌రికి చంద్ర‌బాబు ఒక్క‌సారి గా అవాక్కయ్యారు.ఇవే అభిప్రాయాలు అంద‌రు అధికారుల్లోనూ ఉన్నా బ‌య‌ట‌ప‌డ‌కుండా ముఖ్య‌మంత్రి ఏమనుకుంటారో అని భరిస్తున్నారు. కొందరు మాత్రం ఇలా ఓపెన్ అయ్యేటప్పటి చంద్రబాబు ఏమీ సమాధానం చెప్పలేకపోయారట. మరి ఆయన తన తీరు మార్చుకుంటారో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/