Begin typing your search above and press return to search.

పవన్ బర్త్ డే కేక్ ని కాలితో తన్ని రచ్చరచ్చ

By:  Tupaki Desk   |   1 Sept 2019 2:58 PM IST
పవన్ బర్త్ డే కేక్ ని కాలితో తన్ని రచ్చరచ్చ
X
పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ పవర్ స్టార్. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోకి వచ్చినా ఆయనంటే ప్రాణం ఇచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు.మరి అలాంటి పవన్ బర్త్ డే వస్తుందంటే ఎవరైనా ఊరుకుంటారా? ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమయ్యారు. ఆదివారం నుంచే పండుగను క్రియేట్ చేస్తున్నారు.

సోమవారం పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆదివారం తాడేపల్లిగూడెంలోని శశి విద్యాసంస్థల ఎదురుగా విద్యార్థులతోపాటు పలువురు జనసేన కార్యకర్తలు కలిసి దాదాపు 25 కేజీల కేక్ ను తెప్పించి దాదాపు 100 మంది కేక్ కట్ చేసేందుకు సిద్ధమయ్యారు. పవన్ జిందాబాద్ అంటూ అరుపులు - కేకలతో హోరెత్తించారు.

కాలేజీ ఎదుట ఇలా రచ్చచేయడంపై సీరియస్ అయిన శశి విద్యాసంస్థల డైరెక్టర్ నరేంద్ర బర్త్ డే కేక్ కట్ చేస్తున్న వారి వద్దకు వెళ్లి.. అమ్మాయిలు ఇళ్లకు వెళుతున్నారని.. కాలేజీ గేట్ ఎదుట ఇలా చేయవద్దని వెళ్లిపోవాలని సూచించారు. కేక్ కట్ చేసే వెళ్తామని పవన్ ఫ్యాన్స్ భీష్మించుకు కూర్చున్నారు. దీంతో సీరియస్ అయిన నరేంద్ర కాలేజీ సిబ్బందితో కలిసి పవన్ అభిమానులను చెదరగొట్టారు. కేక్ ను నరేంద్ర లాగి కాలితో తన్ని.. ధ్వంసం చేశారు. పోలీసులు కూడా రావడంతో నరేంద్రకు సపోర్టుగా పవన్ ఫ్యాన్స్ ను లాఠీలతో పరుగులు తీయించారు. ఎదురుతిరిగిన విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

కాగా ఈ విషయం తెలిసిన జనసేన నేతలు భారీ ప్రదర్శనగా చేరుకొని పోలీస్ స్టేషన్ ముట్టడించారు. అరెస్ట్ చేసిన విద్యార్థులను విడుదల చేయాలని ఆందోళన చేశారు. ఈ వివాదం పెద్దది కావడంతో శశి విద్యాసంస్థల డైరెక్టర్ నరేంద్ర జనసేన నేతలకు, పవన్ ఫ్యాన్స్ కు క్షమాపణ చెప్పారు. తమ సంస్థ విద్యార్థులకు డిస్టబెన్స్ అవుతుందనే ఈ పనిచేసినట్టు తెలిపి సారీ చెప్పారు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం వల్ల విద్యార్థినుల తండ్రులు వచ్చారని.. ఇలా కేక్ కట్ చేసి రచ్చ చేస్తే కాలేజీకి చెడ్డ పేరు వస్తుందనే తాను ఇలా వెళ్లిపోవాలని సూచించానని.. పవన్ పై, ఆయన ఫ్యాన్స్ పై తనకు ద్వేషం కోపం లేదని వివరణ ఇచ్చారు. కేక్ ను ధ్వంసం చేసి దాడి చేసిన దానికి పశ్చాత్తాపపడుతున్నానని పేర్కొన్నారు.