Begin typing your search above and press return to search.
‘కాంబిఫ్లామ్’ టాబ్లెట్ వాడుతున్నారా..
By: Tupaki Desk | 13 May 2016 4:57 AM GMTకాస్తంత ఒళ్లు నొప్పులు మొదలైతే చాలు.. మరో ఆలోచన లేకుండా కాంబిప్లామ్ ట్యాబ్లెట్లను వేసుకోవటం మామూలే. అందరికి సుపరిచితమైన కాంబిప్లామ్ నొప్పుల మాత్రగా వాడేయటం అందరికి అలవాటే. ఇంతటి సుపరిచితమైన బ్రాండ్ కు సంబంధించిన తాజాగా బయటకు వచ్చిన ఒక వార్త పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది.
ఈ పెయిన్ కిల్లర్ ను నిబంధనలకు తగ్గట్లుగా తయారుకాలేదన్న విమర్శలు తాజాగా వినిపిస్తున్నాయి. డిజింటిగ్రేషన్ పేరిట జరిపిన నాణ్యత పరీక్షల్లో కాంబిఫ్లామ్ ఫెయిల్ అయినట్లుగా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పేర్కొనటం ఇప్పుడు వార్తాంశంగా మారింది. ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత శరీరంలో కలవటానికి పట్టే సమయానికి సంబంధించిన లెక్కలో తేడా జరిగినట్లుగా చెబుతున్నారు.
ఏమైనా సుపరిచితమైన బ్రాండ్ ఒకటి నిబంధనలకు తగ్గట్లుగా నాణ్యతా పరీక్షల్లో ఫెయిల్ కావటం ఆందోళన కలిగించే అంశమే. అయితే.. నాణ్యత పరీక్షలు జరిపిన బ్యాచ్ లో ఇలాంటి ఇబ్బంది ఉందన్న వాదనలు వినిపించినా.. కాంబిప్లామ్ వాడే వాళ్లు కాస్త ఆలోచించి వాడితే మంచిదన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. సో.. కాంబిఫ్లామ్ ట్యాబ్లెట్లు వాడే వారు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది సుమా.