Begin typing your search above and press return to search.
రండి.. మోడీపై దండెత్తుదాం.. జగన్, కేసీఆర్‌లకు దీదీ లేఖలు!
By: Tupaki Desk | 29 March 2022 10:30 AM GMTకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా గత కొన్నాళ్లుగా గళం విప్పుతున్న బంగాల్ సీఎం మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో మరోసారి గళమెత్తారు. విపక్షాలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. అభ్యుదయ శక్తులన్నీ ఒక వేదికపై సమావేశమై.. ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బీజేపీయేతర పార్టీలకు లేఖ రాశారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు దూరం పెట్టిన ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు కూడా ఈ దఫా మమత లేఖ రాసినట్టు తెలిసింది.
అదేవిధంగా తెలంగాణ సీఎంకు కూడా మమత లేఖ రాశారు. ఈ విషయాన్ని ప్రగతి భవన్ వర్గాలు కూడా చెబుతున్నాయి. నిజానికి ఆమె గత నెలలో ఈ విషయంపై నే పెద్ద ఎత్తున హడావుడి చేశారు. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తోడయ్యారు. అయితే.. ఇంతలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడం.. బీజేపీ విజయం దక్కించుకోవడంతో .. మమత సహా కేసీఆర్‌సైలెంట్ అయ్యారు.
అయితే.. ఇంతలోనే మమత మరోసారి పుంజుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమవ్వాలని బీజేపీయేతర పార్టీలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఈ మేరకు వ్యూహాలపై చర్చించే సమావేశం కోసం పిలుపునిచ్చా రు. బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యత సాధించి.. దేశం కోరుకునే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేసే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలని లేఖలో పేర్కొన్నారు.
బీజేపీ అణచివేత పాలనపై పోరాడేందుకు ప్రగతిశీల శక్తులన్నీ చేతులు కలపాలని మమత పిలుపుని చ్చారు. దేశంలోని సంస్థాగత ప్రజాస్వామ్య విలువలపై బీజేపీ చేస్తున్న ప్రత్యక్ష దాడులపై ఆందోళన వ్యక్తం చేసేందుకే మీకు ఈ లేఖ రాస్తున్నామన్నారు.
సీబీఐ, ఈడీ, సీవీసీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నారని కేంద్రంపై దుమ్మెత్తి పోశారు. ఈ అంశంపై ముందుకు సాగేందుకు ఒక వేదికగా ప్రతిపక్ష పార్టీల నేతలందరం సమావేశం కావాలని ఆమె అభిలషించారు.
మన దేశానికి అవసరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఐక్యంగా, విలువలతో కూడిన ప్రతిపక్షం కోసం మనం కట్టుబడి ఉండాలని బెంగాల్ సీఎం కోరారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఇన్నాళ్లుగా.. ఏపీ సీఎం జగన్‌ను కలుపుకోని.. మమత.. తాజాగా ఆయనకు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కూడా లేఖలు రాయడం గమనార్హం. కేసీఆర్ అయితే.. ఓకే.. కానీ, జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.