Begin typing your search above and press return to search.

అలా కుదర‌కుంటే అలీకి సీటు ప‌క్కాన‌ట‌!

By:  Tupaki Desk   |   23 Jan 2019 4:25 AM GMT
అలా కుదర‌కుంటే అలీకి సీటు ప‌క్కాన‌ట‌!
X
ఎన్నిక‌లు ముంగిట్లోకి వ‌చ్చేస్తున్న వేళ‌.. రాజ‌కీయాల‌కు సంబంధం లేకుండా.. త‌మ‌దైన ప్ర‌పంచంలో ఉండే కొంద‌రు ప్ర‌ముఖులు అక‌స్మాత్తుగా ప్ర‌జాసేవ చేయాల‌న్న భావ‌న‌కు వ‌చ్చేస్తుంటారు. పార్టీ కార్య‌క‌లాపాల్లో పాలు పంచుకోకున్నా.. పార్టీ జెండా మోయ‌కున‌నా.. ప‌వ‌ర్ లేక గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొనే వేళ‌లో గుర్తుకు రాని పార్టీలు.. ఎన్నిక‌లు వ‌చ్చేస్తున్నాయంటే చాలు.. ఎవ‌రికి వారు.. త‌మ‌ను తాము బ‌ల‌మైన అభ్య‌ర్థులుగా ఫీలై.. డ‌బ్బు సంచుల‌తో ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా చాటుతామ‌నే అభ్య‌ర్థులు తెర మీద‌కు వ‌స్తుంటారు.

ఇలాంటి బ్యాచ్ ఎక్కువ‌గా ఏపీ అధికార‌ప‌క్షం తెలుగుదేశం పార్టీలో ఎక్కువ‌గా క‌నిపిస్తుంటారు. తాజాగా అలాంటి సీనే పార్టీలో క‌నిపిస్తోంది. మ‌రో నాలుగు నెల‌ల్లో అసెంబ్లీ.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు తెర లేవ‌నున్న దృష్ట్యా.. పార్టీ త‌ర‌ఫున టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసుకోవ‌టానికి క‌ర్చీఫ్ లు.. మ‌రికొంద‌రు తుండుగుడ్డ‌లు వేసుకుంటున్న పరిస్థితి.

ప్ర‌ముఖ సినీ న‌టుడు.. క‌మెడియ‌న్ అలీ కూడా ఇదే కోవ‌కు చెందుతారు. నిత్యం సినిమాల్లోనూ.. టీవీ షోలలోనూ మునిగి తేలే ఆలీకి.. రాజ‌కీయాల మీద ఆస‌క్తి ఎక్కువ‌. ఏదోలా ఎమ్మెల్యే.. కుద‌ర‌దంటే ఎమ్మెల్సీ అయిపోవాల‌న్న‌ది ఆలీ కోరిక‌గా చెబుతుంటారు. తాను అమితంగా ఆరాధించే ప‌వ‌న్ ను వ‌దిలేసిన ఆలీ.. టీడీపీ టికెట్ కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నారు.

గుంటూరు -1 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ అభ్య‌ర్థిగా తాను బ‌రిలోకి దిగాల‌ని సీరియ‌స్ గా ట్రై చేస్తున్న అలీ విష‌యంపై బాబు కాసింత పాజిటివ్ గానే ఉన్న‌ట్లు చెబుతున్నారు. అలీ కంటే బ‌ల‌మైన అభ్య‌ర్థి దొరికితే గుంటూరు1 టికెట్ స‌ద‌రు నేత‌కు ఇవ్వాల‌ని లేని ప‌క్షంలో అలీకే సీటు క‌న్ఫ‌ర్మ్ చేయాల‌న్న ఆలోచ‌న‌లో బాబు ఉన్న‌ట్లుగా స‌మాచారం. ఇలాంటి హామీలు ఇచ్చేసి.. తీరా బీ ఫారం చేతికి ఇవ్వాల్సిన వేళ‌లో.. సారీ అంటూ సింఫుల్ గా చెప్పే అల‌వాటున్న బాబు.. అలీ విష‌యంలో ఏం చేస్తారో చూడాలి.

ఇదిలా ఉండ‌గా.. ఎన్నారైలు సైతం ఈసారి ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా తానా అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న స‌తీశ్ వేమ‌న ఏపీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని భావిస్తున్నారు ఆయ‌న స్వ‌స్థ‌ల‌మైన క‌డ‌ప జిల్లా రాజంపేట టీడీపీ టికెట్ ను ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మేడా మ‌ల్లికార్జున రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వేళ‌.. ఆయ‌న స్థానంలో స‌తీశ్ వేమ‌న‌కు ఇస్తే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ అంతా బాగానే ఉన్నట్లు క‌నిపించినా.. చివ‌ర్లో ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చే అల‌వాటున్న బాబు.. ఏం చేస్తారో చూడాలి.