Begin typing your search above and press return to search.
బ్రహ్మి లాంటి కమెడియనే.. ప్రెసిడెంట్ అయ్యాడు!
By: Tupaki Desk | 27 Oct 2015 4:15 AM GMTమన దేశంలో కూడా సినిమా నటులకు, టీవీ సెలబ్రిటీలకు రాజకీయాసక్తి తక్కువేమీ కాదు. పార్టీలు పెట్టి సక్సెస్ సాధించి గద్దె ఎక్కిన వాళ్లూ, ఫెయిలై సైలెంట్ అయిన వారూ మనకున్నారు. అయితే వారంతా హీరోలు - హీరోయిన్లు. అంతే తప్ప కమెడియన్ రేంజి వాళ్లు పార్టీ పెట్టేంత సీన్ మన వద్ద లేదు. వారికి రాజకీయ మోజు ఉన్నా.. ఏదో ఒక పార్టీని ఆశ్రయించి టిక్కెట్ కోరుకోవడమే తప్ప.. స్వయంగా పార్టీ పెట్టేంత సత్తా మన వద్ద తక్కువ. అదే గ్వాటెమాలా లో అయితే పరిస్థితి వేరు. అక్కడ టీవీ రంగంలో ప్రముఖుడైన హాస్యనటుడు జిమ్మీ మోరల్స్ సొంతంగా పార్టీ పెట్టాడు. క్రమంగా దాన్ని బలోపేతం చేశాడు. తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తన ఊహకు కూడా అందని విధంగా... ఆయన విజయం సాధించి గ్వాటెమాలా ప్రెసిడెంట్ అయిపోయాడు. ఆయన పార్టీ ఏకంగా 69 శాతం ఓట్లతో అనూహ్యమైన ప్రజాదరణను సొంతం చేసుకోవడం ప్రపంచం అంతా సంచలనాంశంగా ఉన్నది.
వివరాల్లోకి వెళితే.. గ్వాటెమాలాలో తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాలు సోమవారం నాడు విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ అనుభవం లేని బుల్లితెర కమెడియన్ జిమ్మీ మోరల్స్ స్థాపించిన పార్టీ ఘన విజయం సాధించింది. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. గ్వాటెమాలాలో రాజకీయ అవినీతితో విసిగిపోయిన ప్రజలు ఈ ఎన్నికల్లో అనూహ్యంగా సాంప్రదాయ నాయకులను మట్టి కరిపించి, మన తెలుగులో పోల్చదలచుకుంటే బ్రహ్మానందం వంటి ఒక పాప్యులర్ కమెడియన్ కు అధ్యక్షుడిగా పట్టం కట్టడం విశేషమే.
నిజానికి జిమ్మీ మోరల్స్ ఏప్రిల్‌లో పార్టీని స్థాపించి రంగంలోకి దిగినప్పుడు ఆయనకు ఉన్నది కేవలం 0.5 శాతం మంది మద్దతు దారులే. అయితే సెప్టెంబరులో అక్కడి అధ్యక్షుడు ఒట్టో పెరెజ్ అవినీతి కేసులో అరెస్టు అయ్యాడు. దీంతో జిమ్మీ మోరల్స్ పార్టీకి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. అధ్యక్ష ఎన్నికలు వచ్చేసరికి ఆయనకు తిరుగులేకుండాపోయింది. బరిలో ఆయనతో తలపడిన మాజీ అధ్యక్షురాలు శాండ్రా టోర్స్ కు కేవలం 31 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.
అక్కడైతే కమెడియన్స్ కూడా పార్టీ పెట్టి అధ్యక్షుడు అయిపోగలరు.. అంత క్రేజ్ ఉంటుందని తెలుసుకుంటే.. ఇక్కడ కూడా బ్రహ్మానందం లాంటి వాళ్లు.. చిత్తశుద్ధితో పార్టీ పెడితే ప్రయోజనం ఉంటుందేమోనని ఒక అటెంప్ట్ చేస్తారేమో!!