Begin typing your search above and press return to search.
బండ్లను కాపాడండి ప్లీజ్-పృథ్వీ
By: Tupaki Desk | 27 Nov 2018 7:40 AM GMTకాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి బండ్ల గణేష్ చేస్తున్న హడావుడి ఎలాంటిదో అందరికీ తెలిసిందే. టీవీ స్టూడియోలకు వెళ్లి నానా రచ్చ చేస్తున్నాడతను. తెలంగాణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం ఎలా చేయబోతున్నానో కూడా ముందే షో రీల్ వేసి చూపించేశాడు బండ్ల. ఇలాంటి కామెడీలు అతను చాలానే చేశాడు. ఇవి చాలదన్నట్లు రేప్పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే.. తాను బ్లేడు తెచ్చుకుని టీవీ స్టూడియోలోనే గొంతు కోసుకుని కూడా చనిపోతానని బండ్ల హెచ్చరించాడు.
దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారైన సినీ నటుడు పృథ్వీ తనదైన శైలిలో సెటైర్లు వేశాడు. ఆత్మహత్య చేసుకుంటానంటూ బ్లండ గణేష్ చేసిన సవాల్ ను పోలీసుల సీరియస్ గా తీసుకోవాలని.. దయచేసి ఆయన్ని కాపాడాలని.. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలని పోలీసుల్ని కోరాడు పృథ్వీ. రాజకీయాల్లో సవాళ్లు ఆరోగ్యకరంగా ఉండాలని.. ప్రాణాల మీదకు తీసుకొనే విధంగా ఉండకూడదని పృథ్వీ అన్నాడు. బండ్ల గణేష్ మంచి నిర్మాత అని.. తనకు మిత్రుడు కూడా అని.. ఆయన రాజకీయాల్లోకి రావడం తనకు ఆశ్చర్యం కలిగించిందని.. కానీ అతడి మాటలు మాత్రం విచిత్రంగా ఉంటున్నాయని పృథ్వీ చెప్పాడు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా ఫొటో తీయించుకునే సత్తా బండ్లకు ఉందని.. కానీ తనకు ఆ శక్తి లేదని మరో పంచ్ వేశాడు పృథ్వీ. మరోవైపు తన రాజకీయ ప్రయాణం గురించి పృథ్వీ చెబుతూ.. తనను ఇంతకుముందులాగా థర్టీ ఇయర్స్ పృథ్వీ అని ఎవ్వరూ పిలవొద్దని... దాని కంటే వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త అని పిలిపించుకోవడానికి తాను ఇష్టపడతానని.. అలా తనను అందరూ గుర్తు పడతారని అన్నాడు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెసే అధికారంలోకి రాబోతుందని పృథ్వీ జోస్యం చెప్పాడు.