Begin typing your search above and press return to search.
జగన్-పవన్ కళ్యాణ్ ల మధ్య తేడా ఇదే..
By: Tupaki Desk | 21 Jun 2018 10:44 AM GMT‘థర్ట్ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటూ పాపులర్ అయిన కమెడియన్ ఫృథ్వీ తాజాగా వైఎస్ జగన్ ను కలిసి తన మద్దతు తెలిపారు. జగన్ సీఎం కావాలని ఆకాంక్షించారు. తాజాగా జనసేన అధినేత పవన్ - వైసీపీ అధినేత జగన్ ల మధ్య ఓ పోలికను చెప్పి మరోసారి వార్తల్లో నిలిచారు.
ప్రభుత్వాన్ని నిలదీయడంలో జగన్ - పవన్ ది ఒకటే శైలి అన్నారు ఫృథ్వీ. ‘అగ్ని పర్వతంలో లావా ఎప్పుడు బయటపడుతుందో తెలియదు.. ఒక్కసారిగా అది ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది.. జగన్ కూడా అలాంటి వ్యక్తే’ అని అన్నారు. ఇక పవన్ కూడా భగభగ మండే అగ్నిగోళం లాంటి వారని.. జగన్-పవన్ ఇద్దరూ ఇద్దరే అని ప్రశంసించాడు పృథ్వీ.
‘అయితే జనసేన పార్టీ సిద్ధాంతాలు తనకు తెలియవు. ఆ పార్టీ కార్యకర్తలకు కూడా తెలియకపోవచ్చు. కానీ ప్రశ్నిస్తానని వచ్చిన పవన్ మేనరిజం నాకు నచ్చింది. ఆ ప్రశ్నించే నైజం నన్ను ఆకర్షించింది. అందుకే జగన్ తో చిన్న పోలిక పోల్చాను ’ అని పృథ్వీ తెలిపారు.
తనకు ఊహా తెలిసినప్పటి నుంచి వైఎస్ ఆర్ అభిమానినని.. ఇప్పుడు జగన్ అంటే ఇష్టమని అన్నారు. ఈ అభిమానం ఎప్పటికీ చెక్కుచెదరదని తేల్చిచెప్పారు. తాను ముసలోడిని అయినా వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.