Begin typing your search above and press return to search.
టీ పంచాయతీ ఎన్నికల్లో సునీల్ ప్రచారం
By: Tupaki Desk | 25 Jan 2019 12:30 PM GMTతెలంగాణలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెల్సిందే. మూడు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే ఒక దశ ఎన్నికలు పూర్తి అయ్యాయి. రెండవ దశ ఎన్నికలు నేడు రాష్ట్రంలో పలు గ్రామాల్లో జరిగాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతాయి. అయితే రాజకీయ పార్టీలు బలపర్చిన అభ్యర్థులు అంటూ ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో పోటీ చేసిన వారు తమకు ఓటు వేయాలంటూ అడుగుతూ ఉంటారు.
ఇక ఎన్నికల్లో పోటీ చేసిన వారి కోసం సినీ తారలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కొత్తేం కాదు. కాని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక వ్యక్తి కోసం కమెడియన్ సునీల్ స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. తాజాగా నిర్మల్ జిల్లాలో సునీల్ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని టీఆర్ ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరాడు.
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండలంలోని గుండంపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ తరపున పోటీ చేసిన వ్యక్తి సునీల్ కు వీరాభిమానట. సునీల్ ను చాలా కాలంగా అభిమానిస్తూ వస్తున్న ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ వ్యక్తికి సాయం చేసేందుకు సునీల్ స్వయంగా రంగంలోకి దిగాడు. తనను అభిమానిస్తున్న వ్యక్తికి ప్రచారం చేయడంతో పాటు, టీఆర్ ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులందరికి కూడా ఓట్లు వేయాలని సునీల్ కోరడం స్థానికంగా టీఆర్ ఎస్ కు కలిసి వచ్చే విషయమని అక్కడి టీఆర్ ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.