Begin typing your search above and press return to search.
వేణుమాధవ్...నిజంగానే కామెడీ చేశారా?
By: Tupaki Desk | 16 Nov 2018 12:54 PM GMTవేణుమాధవ్...తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అవసరం లేని కామెడీయన్. తనదైన శైలిలో ప్రత్యేకతను చాటుకున్న వేణుమాధవ్ కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అడపాదడపా ఆయా పార్టీల వేదికల మీద ఆయన కనిపిస్తున్నారు. అయితే, తాజాగా ఆయన కొత్త అడుగులో కామెడీ చేసినట్లు చెప్తున్నారు. ఎన్నికల బరిలో నిలవాలని అనుకున్న టాలీవుడ్ కమెడీయిన్ వేణు మాధవ్ కు ఆదిలోనే అపశృతి ఎదురైంది. తన స్వస్థలం కోదాడ కావడంతో అక్కడి నుండే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని వేణు మాధవ్ నిర్ణయించుకోగా...ఆయన నామినేషన్ పత్రాలను అధికారులు తిరస్కరించారు. దీనితో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది.
వేణుమాధవ్ కోదాడలో చదువుకొని మిమిక్రీ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకొని సినీరంగంలో స్థిరపడ్డారు. ప్రజలకు తనవంతు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని.. అందరి సహకారంతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు చెప్పారు. ఏ పార్టీ మద్దతు లేకుండానే స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలో నిలుస్తున్నారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు శుక్రవారం కోదాడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. నామినేషన్ పత్రాలు అధికారులు పరిశీలించగా అవి సరిగ్గా లేవని తేలింది. అధికారులు తిరస్కరించడంతో ఏమీ చేయలేక వేణు మాధవ్ వెళ్లిపోయారు. పూర్తిస్థాయిలో పత్రాలు సేకరించుకున్న తరువాత శని లేదా ఆదివారాల్లో నామినేషన్ దాఖలు చేస్తానని వేణు మాధవ్ వెల్లడించారు. కోదాడ బరిలో నిలవాలని నిర్ణయించుకున్న వేణు మాధవ్ ఎన్నికల కమిషన్‌ను కనీసం అధ్యయనం చేయకుండా నే వెళ్లారా అనే సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది.