Begin typing your search above and press return to search.
రానున్న వారం.. పదిహేను రోజులు లాక్ డౌన్ అవసరమా?
By: Tupaki Desk | 21 March 2020 3:30 PM GMTఅనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటే.. అనవసరమైన ఇబ్బందుల నుంచి బయటపడతామన్న మాటను చాలామంది నోట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడిదే మాట.. దేశానికి శ్రీ రామరక్ష గా మారుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్ లో కరోనా ప్రభావం ఆలస్యంగానే మొదైలంది. కాకుంటే.. ఈ వారంలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదు కావటమే కాదు.. రానున్న రోజుల్లో దీని తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని బయటకు వస్తున్న గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.
కరోనాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఏ మాత్రం తప్పు దొర్లినా.. ఇటలీ.. ఫ్రాన్స్.. ఇరాన్.. మాదిరి పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కేంద్రంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నా.. కొందరు చేసే తప్పులు.. అందరికి శాపాలుగా మారనున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన పలువురు.. వారికి నిర్దేశించినట్లు కాకుండా.. తమకు తోచినట్లుగా వ్యవహరిస్తూ.. కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ వ్యాప్తంగా కఠిన చర్యలకు తెర తీయాల్సిందేనన్న సూచన పలువురి నుంచి వస్తోంది. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త ఒకరు ఆందోళన వ్యక్తం చేస్తూ.. కరోనా వ్యాప్తికి దేశ వ్యాప్తంగా తీసుకున్న చర్యలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవన్న మాటను అనధికారికంగా వెల్లడించటం గమనార్హం. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. దేశంలోకి దిగిన వెంటనే స్వీయ క్వారంటైన్ విషయంలో నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
వేలాది మంది విదేశాల నుంచి దేశానికి చేరుకున్న నేపథ్యంలో.. ఐసోలేషన్ కు తరలించకుండా.. సెల్ఫ్ డిక్లరేషన్ తో వారిని వదిలేయటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త కష్టమైనా.. రానున్న వారం.. పదిహేను రోజుల పాటు పూర్తిగా షట్ డౌన్ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. అలా చేయటం ద్వారా ప్రజలకు కొంత కష్టం కలిగినా.. ఎవరింట్లో వారిని పరిమితం చేయటం ద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రానున్న వారం.. పదిహేను రోజుల్లో దేశంలో ఏం జరుగుతుందన్న భయాందోళనలు ఎక్కువగా ఉంది. పలువురు శాస్త్రవేత్తలు సైతం.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేస్తే.. వైరస్ సోకే వేగానికి బ్రేకులు వేసేందుకు సాయం చేస్తుందని చెబుతున్నారు. మరీ.. విషయంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటాయో చూడాలి.