Begin typing your search above and press return to search.

తిన్నది అరగలేదని లాక్ డౌన్ లో రోడ్డు పైకి ... పోలీసులు అడిగితే .. !

By:  Tupaki Desk   |   25 May 2021 9:38 AM GMT
తిన్నది అరగలేదని లాక్ డౌన్ లో రోడ్డు పైకి ... పోలీసులు అడిగితే .. !
X
దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో దేశ ప్రజల సంరక్షణ కోసం అన్ని రాష్ట్రాలు కూడా దాదాపుగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అయితే , నిత్యావసర సరుకులు తీసుకోవడానికి కొంత సమయాన్ని ప్రతి రోజు ఇస్తున్నాయి. అయితే , కరోనా కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ సమయంలో కూడా కొందరు రోడ్ల మీద యదేచ్ఛగా తిరుగుతూ, నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ లో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా కనిపించాయి. పాలకూర కోసమని, గోధుమ పిండి కోసమని ,ఇలా రకరకాల పేర్లతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారు కనిపించారు. తాజాగా సెకండ్ వేవ్ లాక్ డౌన్ లో ఇలాంటి ఘటనలు కాస్త తక్కువగానే జరుగుతున్నాయని చెప్పాలి.

అయితే తాజాగా ఓ వ్యక్తి తిన్నది అరగడం లేదు అందుకే.. బైటికి వచ్చా అని చెప్పి పోలీసులకే షాక్ ఇచ్చాడు. ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ‘సార్.. ఇంట్లో ఖాళీగా కూర్చోవడంతో తిన్నది అరగడం లేదు.. మా ఇంట్లో వాళ్లందరికీ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చింది. అందుకే ఈనో ప్యాకెట్లు కొనేందుకు బయటకు వచ్చా..అంటూ ఓ వ్యక్తి పోలీసులకు చెప్పడంతో వారు షాక్ అయ్యారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీవీఆర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. లాక్ డౌన్ సమయంలో చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు బైక్ మీద వచ్చాడు. బయటకు ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. దీంతో మందుల కోసం అని చెప్తే , ఏం మందులు తీసుకున్నావో చూపించు అని అడిగారు. దీంతో ఆ యువకుడు బ్యాగులో నుంచి 50 ఈనో ప్యాకెట్లు తీసి చూపించాడు. ఎందుకు ఇన్ని తీసుకున్నావ్ అని అనుమానంగా ప్రశ్నించగా... లాక్ డౌన్ వల్ల తను, తన తండ్రి, సోదరుడు, భార్య ఇంట్లోనే ఉంటున్నాం అని , ఖాళీగా కూర్చొని తినడం వల్ల అరగడం లేదని , అందుకే ఈ ఈనో తీసుకుపోవడానికి వచ్చానని చెప్పడం తో , ఆ వ్యక్తి భాదను అర్థం చేసుకొని పోలీసులు వదిలిపెట్టారు.