Begin typing your search above and press return to search.

పది గంటల్లో ఆసుపత్రి మొత్తాన్ని కమ్మేస్తుందట

By:  Tupaki Desk   |   9 Jun 2020 8:30 AM GMT
పది గంటల్లో ఆసుపత్రి మొత్తాన్ని కమ్మేస్తుందట
X
శాస్త్రీయంగా తెలీకున్నా.. మాయదారి రోగం అంతకంతకూ విస్తరిస్తున్న వేళ ఆసుపత్రులకు వెళ్లటం ఏ మాత్రం క్షేమకరం కాదన్న వాదనకు బలం చేకూరే వైనం ఒకటి బయటకు వచ్చింది. ప్రపంచాన్ని కమ్మేసిన మాహమ్మారి ముప్పు మిగిలిన చోట్ల కంటే ఆసుపత్రుల్లో ఎక్కువగా ఉంటుందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ మాటలో నిజం ఉందన్న విషయాన్ని వెల్లడించింది బ్రిటన్ లోని యూనివర్సిటీ కాలేజ్ హాస్పిటల్ కు చెందిన శాస్త్రవేత్తలు.
మిగిలిన చోట్లతో పోలిస్తే.. మాయదారి వైరస్ ముప్పు ఆసుపత్రుల్లో ఎక్కువని పేర్కొన్నారు. అంతేకాదు.. మహమ్మారి బారినపడిన రోగి చికిత్స పొందే గది నుంచి పేషెంట్ ఉండే వార్డులో సగానికి పైనే ఉపరి తలాలకు వైరస్ కేవలం పది గంటల సమయంలోనే చేరుకుంటుందన్న వైనం తాము నిర్వహించిన అధ్యయనం తెలిసిందని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లోని వార్డుల్ని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉండాలని చెబుతున్నారు. వైద్యులు..ఆరోగ్య సిబ్బంది అంతా పీపీఈ (వ్యక్తిగత రక్షణ పరికరాలు) కిట్లను తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉందంటున్నారు. చాలా తక్కువ వ్యవధిలోనే ఆసుపత్రిని వైరస్ కమ్మేసే ప్రమాదం ఉందంటున్నారు.

సరైన శానిటైజేషన్ లేని పక్షంలో పది గంటల్లో మొత్తంగా కమ్మేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమైతే తప్పించి ఆసుపత్రికి వెళ్లకూడదన్న మాటతో పాటు.. అవసరమై వెళ్లినా.. వెంట శానిటైజర్ ను ఉంచుకోవటం.. ముఖానికి మాస్కు పెట్టుకోవటం చాలా అవసరమన్నది మర్చిపోకూడదు.