Begin typing your search above and press return to search.

సెంటినెలీస్ తెగ..చావును దగ్గరనుంచి చూశాడట..

By:  Tupaki Desk   |   24 Nov 2018 11:50 AM GMT
సెంటినెలీస్ తెగ..చావును దగ్గరనుంచి చూశాడట..
X
బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవులకు సమీపంలో ఓ చిన్న దీవి ఉంటుంది . ఇక్కడ ఎన్నో ఏళ్లుగా సెంటినెలీస్ అనే ఆదిమ తెగ వారు జీవిస్తుంటారు.. బట్టలు లేకుండా.. విల్లు బాణం పట్టుకొని జంతువులు - చేపలు వేటాడుతూ ఇంకా అనాగరికంగా బతుకుతుంటారు. వీరు అత్యంత క్రూరులు. ఆ దీవిలో వచ్చిన మనుషులను చంపేస్తుంటారు. తాజాగా ఓ అమెరికన్ ను చంపేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆదిమ తెగ ప్రజలపై చర్చ జరుగుతోంది. వీరు ఎవరు.? ఎన్ని ఏళ్ల నుంచి అదే దీవిలో చిక్కుబడిపోయారు.. వీరి ఆచార వ్యవహారాలపై ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు..

తాజాగా ఈ దీవిలో దిగి ప్రత్యక్షంగా వారిని చూసిన ఆర్మీ కమాండెంట్ ప్రవీణ్ గౌర్ పలు సంచలన విషయాలను మీడియాకు వెల్లడించాడు. 2006లో ఓ రెస్యూ ఆపరేషన్ లో భాగంగా సెంటినెలీస్ ప్రజలను దగ్గరగా చూశానని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. 2006లో చేపలు పట్టడానికి వెళ్లి గల్లంతైన ఇద్దరు జాలరులను వెతకడానికి తాను ఓ హెలీ క్యాప్టర్ లో సెంటినెల్ ద్వీపానికి వెళ్లానని ప్రవీణ్ తెలిపారు. అక్కడ జాలరుల పడవ తమకు కనిపించిందని.. దాని దగ్గరకు వెళ్లగా ఒక్కసారిగా బాణాలు మా హెలీక్యాప్టర్ పైకి దూసుకొచ్చాయని తెలిపారు. ఆ బాణాలు 100 అడుగుల ఎత్తువరకూ రాగా హెలీక్యాప్టర్ ను దూరంగా తీసుకెళ్లామని తెలిపారు. దీంతో వారిని పడవకు దూరంగా తీసుకెళ్లే ప్లాన్ వేసి సక్సెస్ అయ్యామని తెలిపారు. దాదాపు 50 మంది దాకా సెంటినెలీస్ తెగ వారు అక్కడ కనిపించారని తెలిపారు. ఒంటి మీద గుడ్డలు లేకుండా కొందరు.. ఎర్రవస్తం లాంటిదేదో కట్టుకొని కొందరున్నారని తెలిపారు. స్త్రీలు కనిపించలేదన్నారు.

బోటు దగ్గరకు రానీయకుండా వారంతా బాణాలు విసురుతుంటే వారిని కిలోమీటర్ దూరం దీవి చుట్టు పరిగెత్తించి మళ్లీ వెనక్కి వచ్చి బోటు వద్ద ఆగామని.. అక్కడ గుంతలో ఓ జాలరీ మృతదేహం కనిపించిందని తెలిపారు. దాన్ని హెలీక్యాప్టర్ లో ఎక్కించి మరో మృతదేహం కోసం తవ్వుతుండగా.. తెగ వారు వెనక్కి వచ్చి బాణాలతో విసరడంతో హెలీక్యాప్టర్ ను పైకి తీసుకొని తిరిగి వచ్చామని తెలిపారు. ఆలస్యమైనా.. హెలీక్యాప్టర్ లేవకపోయినా తాము కూడా మరణించేవాళ్లమేనని చెప్పుకొచ్చారు. చావును దగ్గరి నుంచి చూశామని తెలిపారు.

మరో మృతదేహం కోసం మరోసారి వెళ్లగా.. కొందరు బోటు దగ్గరే మృతదేహం తీసుకురాకుండా కాపాలా ఉండి బాణాలు విసరారని తెలిపారు... మరికొందరు మా వెంట పడి బాణాలు వేశారన్నారు. ఇలా మా మొదటి ప్లాన్ బెడిసికొట్టిందని.. సెంటినేలిస్ తెగ వారికి కూడా బుద్దిబలం బాగా ఉందని అర్థమైందన్నారు. దీంతో ప్రాణభయంతో వెనక్కి వచ్చేశామన్నారు. మా దగ్గర గన్ లు ఉన్నా కాల్చే పరిస్థితి లేదన్నారు. దీన్ని బట్టి సెంటినెలీస్ తెగ ప్రజలు ఒకసారి చేసిన తప్పు మళ్లీ చేయరని.. బాగా తెలివిగల వాళ్లని తమకు ఈ సంఘటనతో అర్థమైందని ప్రవీణ్ వివరించారు.

ప్రవీణ్ ధైర్యసాహసాలకు 2006లో భారత ప్రభుత్వం తత్రక్షన్ మెడల్ ను బహూకరించి సత్కరించింది. తాజాగా ఆయన ఎన్డీటీవీతో సెంటినెలీస్ తెగ వారి గురించి చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి.