Begin typing your search above and press return to search.
ఆదిలోనే బోల్తా పడ్డ పవన్
By: Tupaki Desk | 13 Nov 2016 3:30 PM GMTఆవేశంగా ప్రసంగిస్తాడు... ఆలోచించేలా మాట్లాడుతాడు అని పేరున్న జన సేన అధినేత రాజకీయాల్లోకి ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్న కొద్దీ దెబ్బలు తింటున్నారు. రీసెంటుగా అనంతపురం జిల్లాలో ఆయన సాగించిన యాత్రలో చెప్పిన మాటలు తీవ్ర వివాదాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు పవన్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. వీడియోలు రూపొందించి మరీ కడిగిపారేస్తున్నారు.
అనంతపురం జిల్లా పర్యటనలో పవన్ అక్కడి మహిళల దుస్థితిపై మాట్లాడుతూ నోరు జారారు. సెంటిమెంట్ గుప్పించి ఆ జిల్లా ప్రజలకు బాగా దగ్గరవ్వాలన్న ఉద్దేశంతో జిల్లా మహిళలపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరువుతో ఇక్కడ బతకలేక మహిళలు ఒళ్లమ్ముకుంటున్నారని అన్నారు. ఆ మాటలు విన్నవారంతా పవన్ పై మండిపడుతున్నారు. ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో పవన్ పై నిప్పులు చెరుగుతోంది. కొందరు ఏకంగా సెల్ఫీ వీడియోలు తీసి పవన్ ను కడిగేస్తున్నారు. అనంతపురం జిల్లా మహిళలు మీకు ఎలా కనిపిస్తున్నారు పవన్. కరువు వస్తే ఒళ్లు అమ్ముకునే వారిలా కనిపిస్తున్నారా?. నీకు చెప్పిన వాడు ఎవడు? అంటూ నిలదీస్తున్నారు. నిజంగా కరువుకు లొంగిపోయి ఒళ్లమ్ముకుంటే ఆత్మహత్యల్లో అనంతపురం జిల్లా ఎందుకు ముందుంటుంది. ప్రాణం కన్నా మానానికే ఎక్కువ విలువ ఇస్తాం కాబట్టే చావడానికైనా సిద్ధపడుతున్నాం అని కొందరు పవన్ కు సందేశాలు పంపుతున్నారు.
పవన్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తున్నారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తూ పవన్ ను కడిగేస్తున్నారు. ఊహించని ఈ పరిణామానికి పవన్ షాక్ తిన్నట్లు సమాచారం. ఇక నుంచి ప్రసంగాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆయన భావిస్తున్నారట. అయితే... పవన్ జారిన ఈ మాటల వెనుక ప్రసంగాలు రాసినవారు ఎవరూ లేరట.. ఆయనే ఫ్లోలో వచ్చిందని నోరు జారేసినట్లు తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/