Begin typing your search above and press return to search.

చిరంజీవిపై చిల్ల‌ర వ్యాఖ్య‌లా? సీపీఐ నారాయ‌ణ‌కు కౌంట‌ర్!

By:  Tupaki Desk   |   19 July 2022 2:02 PM GMT
చిరంజీవిపై చిల్ల‌ర వ్యాఖ్య‌లా? సీపీఐ నారాయ‌ణ‌కు కౌంట‌ర్!
X
మెగాస్టార్ చిరంజీవిపై సిపిఐ నారాయ‌ణ వ్యాఖ్యల‌ను అభిమానులు ఖండిస్తున్నారు. తిరుపతి మీడియాతో మాట్లాడుతూ చిరంజీవిపై అనుచిత వాఖ్యలు చెసిన సీపీఐ నారాయణ పై రాష్ట్ర‌ కాపు నాయకులు.. శ్రీశైల దేవస్థాన మాజీ ధర్మకర్త పత్తి వెంక‌న్న సీరియ‌స్ కౌంట‌ర్లు వేశారు. యువ‌త‌రానికి స్ఫూర్తి ప్ర‌ధాత.. నిజ‌మైన ప్ర‌జా సేవ‌కుడు అయిన‌ చిరంజీవిపై ఇలాంటి అనుచిత వ్యాఖ్య‌లు స‌రికాద‌ని.. ఆయ‌న‌కు భేష‌రతుగా క్ష‌మాప‌ణలు చెప్పాల‌ని డిమాండ్ చేసారు.

మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర రాష్ట్ర‌ ప్రభుత్వాలు అల్లూరి సీతారామ‌రాజు విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు ఆహ్వనించడంపై C.P.I ప్రధాన కార్యదర్శి హోదాలో నారాయణ చిల్లర వ్యాఖ్యలు చేయడం తన హోదాకు తగదని ప‌త్తి వెంక‌న్న‌ హితవు ప‌లికారు.

రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అభిమానుల్ని సంపాదించుకున్న ఏకైక వ్యక్తి చిరంజీవి. గత కొన్ని దశాబ్దాలుగా నిరాఘంటంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు - ఐ బ్యాంక్ ద్వారా నిస్వార్థ ఉచిత సేవలు చేశారు. ఇవ‌న్నీ మీకు తెలియ‌నివా? అని ప్ర‌శ్నించారు.

ఇటీవల క‌రోనా క‌ల్లోలంలో ఆంధ్ర ప్ర‌దేశ్- తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో తన సొంత నిధులతో ఆక్సిజన్ బ్యాంక్ లు నెల‌కొల్పి సేవలు అందించిన ప్రాణదాత మన పద్మభూషణ్ చిరంజీవి గారు... అలాంటి మహోన్నత వ్యక్తి ని అవమానిస్తే తెలుగు ప్రజలను అవమానించడమే అవుతుంది అని అన్నారు. సిపిఐ నారాయణ బేషరతుగా చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కరోనా స‌మ‌యంలో మెగాస్టార్ చిరంజీవి- రామ్ చ‌ర‌ణ్ బృందం దాదాపు 30 కోట్లు వెచ్చించి ఇరు తెలుగు రాష్ట్రాల‌లో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆక్సిజ‌న్ బ్యాంకులు నెల‌కొల్పి క‌రోనా రోగుల పాలిట ప్రాణ ప్ర‌దాత‌లుగా మారిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా స‌మ‌యంలో ఆప‌న్నుల‌కు చిరంజీవి ల‌క్ష‌ల్లో ఆర్థిక‌ విరాళాలు అందించారు.

క‌ళామ‌త‌ల్లి బిడ్డ‌గా ఆయ‌న టాలీవుడ్ క‌ళాకారులు సాంకేతిక నిపుణుల‌కు మెగాభిమానుల‌కు క‌ష్ట‌ కాలంలో విస్త్ర‌తంగా ఆర్థిక సాయం చేశారు. కార్మికులంతా పనులు లేక ప‌స్తులు ఉండ‌కూడ‌ద‌ని క‌రోనా స‌మ‌యంలో బియ్యం నిత్యావ‌స‌ర స‌రుకుల‌ను అందించారు. ఇవేగాక అన్ని స‌మ‌యాల్లో ఆయ‌న ప్ర‌జాసేవ‌లో నిమ‌గ్న‌మై ఉన్నారు. ఆయ‌న‌కు అల్లూరి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించే అర్హ‌త లేదా? అని చిరంజీవి యువ‌త అభిమాన సంఘాలు ప్ర‌శ్నిస్తున్నాయి.